Allu Arjun, Samantha: సమంత సాంగ్ పై బన్నీ షాకింగ్ కామెంట్స్!

స్టార్ హీరో అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ ప్రపంచవ్యాప్తంగా 3,000కు పైగా థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. కొన్ని కారణాల వల్ల పుష్ప మలయాళ వెర్షన్ రేపటి నుంచి థియేటర్లలో ప్రదర్శితం కానున్నట్టు చిత్రబృందం వెల్లడించింది. మాస్ ప్రేక్షకులు మెచ్చేలా పుష్ప సినిమా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. చిన్నచిన్న లోపాలు ఉన్నా బన్నీ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు పుష్ప ది రైజ్ నచ్చుతుంది. ఈ సినిమాలో సమంత చేసిన స్పెషల్ సాంగ్ ఏ స్థాయిలో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

యూట్యూబ్ లో ఈ సాంగ్ కు ఏకంగా 38 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. స్టార్ హీరోల సినిమాల ట్రైలర్లను మించి సమంత స్పెషల్ సాంగ్ కు వ్యూస్ రాగా ఈ పాటలోని లిరిక్స్ పై అభ్యంతరాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఏపీ పురుషుల సంఘం ఈ పాటను బ్యాన్ చేయాలంటూ కోర్టును ఆశ్రయించింది. ఈ పాటలోని లిరిక్స్ ను మార్చాలని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. తమిళనాడు రాష్ట్రంలోని పురుషుల సంఘం సైతం ఈ పాట గురించి కోర్టు మెట్లు ఎక్కినట్టు తెలుస్తోంది.

పుష్ప ప్రమోషన్స్ లో పాల్గొన్న అల్లు అర్జున్ కు ఈ పాట వివాదం గురించి ప్రశ్న ఎదురైంది. “మీ మగబుద్ది వంకరబుద్ధి” అనే పాట లిరిక్స్ విషయంలో నెలకొన్న వివాదాలపై మీ అభిప్రాయం ఏమిటని రిపోర్టర్ బన్నీని అడిగారు. ఆ ప్రశ్నకు బన్నీ స్పందిస్తూ “లిరిక్స్ లో తప్పు లేదు ఇదే నిజం” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

బన్నీ అభిమానులు మాత్రం సినిమాను సినిమాలా చూడాలని అనవసరమైన వివాదాలు కరెక్ట్ కాదని అభిప్రాయపడుతున్నారు. పుష్ప గురించి కొంతమంది పాజిటివ్ గా స్పందిస్తుంటే మరి కొందరు నెగిటివ్ గా స్పందిస్తున్నారు. ఈ సినిమా తుది ఫలితం తెలియాలంటే వీకెండ్ వరకు అగాల్సిందే. రెండు రోజుల్లోనే ఈ సినిమా 50 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus