అల్లు అర్జున్ (Allu Arjun) ‘పుష్ప 2’ (Pushpa 2) తర్వాత తమిళ స్టార్ దర్శకుడు అట్లీ (Atlee Kumar) దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా కోసం ఇటీవల విదేశాలకు వెళ్లి వచ్చాడు అల్లు అర్జున్. ఈ క్రమంలో ఎయిర్ పోర్ట్ లో తీసిన కొన్ని ఫోటోలు వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. జూన్ నుండి అట్లీ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది. దీంతో ఇప్పుడు కొంచెం రిలాక్స్డ్ మోడ్లో ఉన్నాడు బన్నీ. ఈ సమయాన్ని పూర్తిగా ఫ్యామిలీ కోసమే కేటాయించాడు.
తాజాగా తమ బంధువుల పెళ్లి వేడుకలో సందడి చేశాడు అల్లు అర్జున్. భార్య స్నేహ రెడ్డి, కూతురు అర్హతో కలిసి అతను ఈ వేడుకలో పాల్గొన్నాడు. పెళ్ళికొడుకు, పెళ్లికూతురు అల్లు అర్జున్ కజిన్స్ అవుతారని తెలుస్తుంది. అల్లు అర్జున్, స్నేహా రెడ్డి దంపతుల డ్రెస్సింగ్ కూడా స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. ముఖ్యంగా అల్లు అర్జున్ ట్రిమ్ చేసుకుని చాలా కూల్ గా కనిపిస్తున్నాడు.’పుష్ప’ (Pushpa) ‘పుష్ప 2’ సినిమాల వల్ల దాదాపు 5 ఏళ్ళ పాటు అతను గడ్డంతోనే ఉండాల్సి వచ్చింది.
ఇప్పుడు చాలా వరకు ట్రిమ్ చేసుకున్నాడు. అతని ఏజ్ ఒక 5 ఏళ్ళు తగ్గిపోయినట్టు ఉంది అని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్న సందర్భాలు కూడా చూస్తూనే ఉన్నాం. ఇక నూతన వధూవరులను బన్నీ, స్నేహ..లు ఆశీర్వదించి అక్కడి నుండి వెళ్ళిపోయినట్టు స్పష్టమవుతుంది. అయితే ఈ పెళ్ళి వేడుకలో అల్లు అర్జున్ ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.