ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉండే అల్లు అర్జున్ త్వరలోనే తెలంగాణ ఎన్నికల బరిలోకి దిగబోతున్నారని తెలుస్తోంది. ఇలా అల్లు అర్జున్ వచ్చే ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ తరపున తన మామయ్య కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి మద్దతుగా ఈయన ఎన్నికల బరిలోకి దిగబోతున్నారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే తన మామయ్యను గెలిపించే దిశగా అడుగులు వేస్తూ ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగము కానున్నారు.
కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఇదివరకే బీఆర్ఎస్ పార్టీ తరఫున 2014వ సంవత్సరంలో ఎన్నికలలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు.అయితే వచ్చే ఎన్నికలలో భాగంగా ఈయన నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలను కూడా ప్రారంభించారు. ఇలా సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్కొంటూ వచ్చే ఎన్నికలపై ఫోకస్ పెట్టారు.
తనకు నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి టికెట్ ఇవ్వబోతున్నట్లు అధిష్టానం కూడా తెలియజేయడంతో ఈయన ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 19వ తేదీ నుంచి ఎన్నికల కార్యకలాపాలను కొనసాగించబోతున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికలలో ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో చంద్రశేఖర్ రెడ్డి ఈసారి ఎన్నికల ప్రచారాలలో భాగంగా తన అల్లుడు , ప్రముఖ సినీ నటుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారంలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది.
అల్లు అర్జున్ కు పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే.ఇలా ఎంతో మంచి గుర్తింపు ఉన్నటువంటి అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారం కోసం తీసుకువెళ్తే తనకు మంచి మద్దతు లభిస్తుందని భావించిన చంద్రశేఖర్ రెడ్డిఎన్నికల ప్రచార కార్యక్రమాలలో తన అల్లుడిని భాగం చేయాలని భావించారట ఇక అల్లు అర్జున్ (Allu Arjun) ఎన్నికల ప్రచారంలోకి వస్తే తన మామయ్య గెలుపు ఖాయమని తెలుస్తుంది.