అల్లు అర్జున్ (Allu Arjun) , మహేష్ బాబు (Mahesh Babu) ఇద్దరూ కూడా టాలీవుడ్లో ఉన్న స్టార్ హీరోలు. అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు. మహేష్ బాబు మాత్రం ఇంకా పాన్ ఇండియా లీగ్లోకి ఎంట్రీ ఇవ్వలేదు. వీళ్ళ సినిమాలకి ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్లోటింగ్ ఎక్కువగానే ఉంటుంది. ఒకసారి వీళ్ళ 5 సినిమాల బడ్జెట్ లెక్కలు, మరియు వాటి కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
Allu Arjun vs Mahesh Babu
ముందుగా అల్లు అర్జున్ గత 5 సినిమాల బడ్జెట్ & కలెక్షన్స్ లెక్కలు :
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ మూవీ ఇది. ‘గీతా ఆర్ట్స్’ బ్యానర్ పై అల్లు అరవింద్ (Allu Aravind) ఈ చిత్రాన్ని రూ.50 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్లో రూ.125 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది ఈ మూవీ.
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో రూపొందిన కమర్షియల్ మూవీ ఇది. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు (Dil Raju) ఈ చిత్రాన్ని రూ.50 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్లో రూ.150 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది ఈ చిత్రం.
అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ (Vakkantham Vamsi) దర్శకత్వంలో రూపొందిన ఆర్మీ బ్యాక్ డ్రాప్ మూవీ ఇది. ‘రామలక్ష్మీ సినీ క్రియేషన్స్’ బ్యానర్ పై శిరీష శ్రీధర్ లగడపాటి ఈ చిత్రాన్ని రూ.55 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.100.52 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) డైరెక్షన్లో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ఇది.’గీతా ఆర్ట్స్’ ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్లపై అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (S. Radha Krishna) ..లు ఈ చిత్రాన్ని రూ.100 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.280 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
5) పుష్ప ది రైజ్ (Pushpa: The Rise) :
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ (Sukumar) డైరెక్షన్లో రూపొందిన మాస్ మూవీ ఇది. ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ ఎర్నేని (Naveen Yerneni), వై.రవిశంకర్ (Y .Ravi Shankar)..లు ఈ చిత్రాన్ని రూ.250 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.393.5కోట్లు గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
మహేష్ బాబు గత 5 సినిమాల బడ్జెట్ & కలెక్షన్స్ లెక్కలు :
మహేష్ బాబు హీరోగా కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ కమర్షియల్ మూవీ ఇది. ‘డీవీవీ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై డీవీవీ దానయ్య (D. V. V. Danayya) ఈ చిత్రాన్ని రూ.65 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.225 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ ‘వైజయంతి మూవీస్’ ‘పీవీపీ సినిమా’ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్, సి.అశ్వినీదత్, ప్రసాద్ వి పొట్లూరి, పరమ్ వి పొట్లూరి, కెవిన్ అన్నె..లు కలిసి ఈ చిత్రాన్ని రూ.60 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.200 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
3) సరిలేరు నీకెవ్వరు (Sarileru Neekevvaru) :
మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. ‘ఎకె ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర (Anil Sunkara) ఈ చిత్రాన్ని రూ.75 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.260 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
మహేష్ బాబు హీరోగా పరశురామ్ పెట్ల (Parasuram) దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. ‘మైత్రి మూవీ మేకర్స్’ ’14 రీల్స్ ప్లస్’ ‘జి మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్’ సంస్థలపై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్, రామ్ ఆచంట (Ram Achanta), గోపీచంద్ ఆచంట.. కలిసి ఈ చిత్రాన్ని రూ.60 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.230 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ(చినబాబు) ఈ చిత్రాన్ని రూ.150 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.172 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.