తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహారెడ్డి గురించి అందరికీ సుపరిచితమే. ఈమె హీరోయిన్ గా ఇండస్ట్రీలో కొనసాగ లేకపోయినా ఈమెకు మాత్రం సోషల్ మీడియాలో హీరోయిన్ కి మించి ఫాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. స్నేహ రెడ్డికి ఏకంగా ఇంస్టాగ్రామ్ లో 8.6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.
ఈమె సినిమాలలో లేకపోయినా తరచూ డిజైనింగ్ దుస్తులను ధరించి ఫోటోలకు ఫోజులిస్తూ తన గ్లామరస్ ఫోటోలను అలాగే తన భర్త పిల్లల గురించి తరచూ అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో తనకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇకపోతే తాజాగా స్నేహ రెడ్డి తన అభిమానులతో సరదాగా ముచ్చటించారు.
ఈ క్రమంలోనే అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఈమె సమాధానాలు చెప్పుకొచ్చారు.ఈ సందర్భంగా ఒక నెటిజన్ స్నేహ రెడ్డిని ప్రశ్నిస్తూ కొత్త ఏడాది రాబోతుంది కొత్త ఏడాదిలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు అని ప్రశ్నించగా ఈమె కొత్త ఏడాదిలో అవాన్ తో కలసి కిచెన్ లో బాగా వంట చేయాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. ఇక మరొక నేటిజన్ మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి అని కూడా ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు స్నేహ రెడ్డి సమాధానం చెబుతూ తనకు బిర్యాని అంటే మహా ఇష్టమని చెబుతూ బిర్యానీ ఫోటో ని షేర్ చేశారు. తనకు ఎక్కువగా ఇండియన్ వంటకాలు అంటేనే ఇష్టమని ఈ సందర్భంగా అల్లు స్నేహారెడ్డి తనకు సంబంధించిన అన్ని విషయాల గురించి అభిమానులతో పంచుకున్నారు.ప్రస్తుతం స్నేహ రెడ్డి చెప్పినటువంటి ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.