బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘అల్లుడు అదుర్స్’ రెండో వీకెండ్ ను క్యాష్ చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యింది. ‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదలయ్యింది.నభా నటేష్, అనూ ఇమ్మాన్యుయల్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. నిజానికి విడుదలైన రోజున ఈ చిత్రానికి ఏమాత్రం పాజిటివ్ టాక్ రాలేదు.. కానీ సాయి శ్రీనివాస్ కు మాస్ లో మంచి క్రేజ్ ఉంది, అలాగే సంక్రాంతి పండుగ సెలవులు కూడా కలిసి రావడంతో మంచి ఓపెనింగ్స్ ను రాబట్టింది. మరో 3 సినిమాలు పోటీ ఉన్నప్పటికీ ఈ చిత్రం మొదటివారమే 70శాతం రికవరీ సాధించింది.అయితే పండుగ ముగిసిన తరువాత అంతగా జోరు చూపించలేకపోయింది.
ఇక ఈ చిత్రం 11 రోజుల కలెక్షన్లను ఓ సారి గమనిస్తే :
నైజాం | 2.18 cr |
సీడెడ్ | 1.42 cr |
ఉత్తరాంధ్ర | 1.50 cr |
ఈస్ట్ | 0.54 cr |
వెస్ట్ | 0.55 cr |
కృష్ణా | 0.34 cr |
గుంటూరు | 0.57 cr |
నెల్లూరు | 0.28 cr |
ఏపీ+తెలంగాణ టోటల్ | 7.38 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.13 cr |
ఓవర్సీస్ | 0.05 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 7.56 cr |
‘అల్లుడు అదుర్స్’ చిత్రానికి 13కోట్ల వరకూ బిజినెస్ జరిగింది. అయితే చాలా వరకూ నిర్మాత ఓన్ రిలీజ్ చేసుకున్నాడు కాబట్టి.. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయ్యి క్లీన్ హిట్ గా నిలవడానికి 10కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. 11 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 7.56 కోట్ల షేర్ ను రాబట్టింది.ఇంకా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 2.5 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. రెండో వీకెండ్ ను ఈ చిత్రం క్యాష్ చేసుకుంటుంది అనుకుంటే అలా జరగలేదు.
Click Here To Read Movie Review
Most Recommended Video
మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!