డైలాగ్‌ను దొంగిలించడమా? ఇదెక్కడ జరుగుతుంది? అసలు ఇలా కూడా జరుగుతుందా? అని అనుకుంటున్నారా? అవును మీరు చదివింది నిజమే.. ఇది జరిగింది కూడా. అయితే అక్కడే ఓ ట్విస్ట్ ఉంది. అయితే జరిగింది ఇప్పుడు కాదు చాలా ఏళ్ల క్రితమే. ఇదంతా జరిగింది ‘సత్తే పే సత్తా’ అనే సినిమా షూటింగ్ సమయంలో జరిగింది. అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) – శక్తి కపూర్ (Shakti Kapoor)కలసి నటించిన సినిమా ఇది. అమితాబ్ బచ్చన్ వయసుకీ, ఆయన చేసిన పనులకు అస్సలు సంబంధం ఉండదు.
Amitabh Bachchan
ఇప్పటికీ సినిమా సెట్స్‌లో ఆయన సందడి చేస్తూనే ఉంటారు. మొన్నీమధ్య ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమా ముంబయి ప్రచారంలో ప్రభాస్ (Prabhas) , రానాకు (Rana) పోటీగా దీపిక పడుకొణె (Deepika Padukone) విషయంలో సరదాగా జోక్స్ వేశారు. మీరు కూడా ఆ సీన్ చూసే ఉంటారు. అలాంటి అమితాబ్ (Amitabh Bachchan) యంగ్ ఏజిలో ఎంత అల్లరి చేసి ఉంటారు చెప్పండి. అమితాబ్ బచ్చన్ యాంగ్రీ యంగ్ మేన్‌గా ఉన్న రోజుల్లో జోష్ గురించి ఆయన సన్నిహితులు ఇప్పటికీ చెబుతుంటారు.
తోటి నటులపై ప్రాంక్ చేసేవారు కూడా. అలా ఓసారి ప్రముఖ సీనియర్ నటుడు శక్తి కపూర్‌ను ఆటపట్టించారట. ‘సత్తే పే సత్తా’ చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఓ రోజు ‘డుక్కీ పే డుక్కీ హో..’ పాట చిత్రీకరణ చేస్తున్నారట. ఆ పాటలో రెండో డైలాగ్ చెప్పడానికి శక్తి కపూర్ వెయిట్ చేస్తున్నారట. ఇంతలో అమితాబ్ బచ్చన్ వచ్చి.. శక్తి కపూర్ ప్లేస్‌లో ఉండి ఆ డైలాగ్ చెప్పేశారట. దాంతో ‘నా డైలాగ్ అమితాబ్ (Amitabh Bachchan) చెప్పేస్తున్నారు.
ఇక నా కెరీర్ అయిపోయింది. ఆయన స్టార్ నటుడు. ఏదైనా చేయగలరు’ అంటూ శక్తి కపూర్ బాధపడ్డారట. దర్శకుడి దగ్గరకు వెళ్లి ‘ఇలా చేయడం సరికాదు’ అని చెప్పారట. ఈక్రమంలో తెలియకుండానే కన్నీళ్లు వచ్చేశాయట. అయితే ఇదంతా ప్రాంక్ అని, తనను ఆటపట్టించడం కోసమే అలా చేశారు అని, కెమెరా రోలింగ్‌లో లేదు అని దర్శకుడు చెప్పారట.