బాహుబలి కోసం ప్రభాస్ ఎంత కష్టపడ్డాడంటే??
- March 24, 2017 / 05:57 AM ISTByFilmy Focus
టాలీవుడ్ లో టాప్ హిట్ ఏది అంటే మనం టక్కున చెప్పే మాట బాహుబలి….ఈ సినిమా విషయంలో దర్శకుడు రాజమౌళి ప్రతిభను మనం ఖచ్చితంగా మెచ్చుకుని తీరాల్సిందే…అదే క్రమంలో ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరూ ఈ సినిమా కోసం అహర్నిశలూ కష్టపడ్డారు…ఇదిలా ఉంటే ఈ సినిమా అన్ని హంగులు పూర్తి చేసుకుని త్వరలో అంటే రానున్న ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా ఒక సునామీని తలపించే విధంగా విడుదల కానుంది…అదే క్రమంలో ఈ సినిమాలో ఎవరెవరు ఎంత కష్టపడ్డారో తెలీదు కానీ…హీరో ప్రభాస్ మాత్రం ఈ సినిమా విషయంలో పంచ ప్రాణాలు పెట్టి కష్ట పడ్డాడు అని అందరికీ తెలిసిందే…అయితే అసలు ఈ సినిమా కోసం ప్రభాస్ ఎంత కష్ట పడ్డాడు….ఏం చేశాడు అంటే…ఒకసారి ఈ స్టోరీ చదవండి మీకే అర్ధం అవుతుంది….ఈ సినిమాలో ప్రభాస్ ముఖ్యంగా రెండు పాత్రలు చేశాడు….ఒకటి శివుడు పాత్ర కాగా…రెండోవా పాత్ర టైటిల్ రోల్ “బాహుబలి”. అయితే ఈ సినిమాలో రెండు పాత్రలకు న్యాయం చేసేందుకు….ప్రభాస్ దాదాపుగా 100కేజీల బరువు పెరిగాడని సమాచారం.
అంతేకాదు…శివుడు పాత్ర కోసం ఒక రకమైన భోజనం…బాహుబలి పాత్ర కోసం మరొక రకమైన భోజనం ప్రభాస్ చేసేవాడు అని సమాచారం…శివుడు పాత్ర చెయ్యడానికి రోజుకు 6సార్లు ఆహారం అదీ…స్పెషల్ ట్రేనర్స్ చెప్పిన ప్రకారం తీసుకునే వాడట….ఇక బాహుబలి పాత్రకు వస్తే దాదాపుగా రోజుకి 8 సార్లు ట్రేనర్స్ పర్యవేక్షణలో ఆహారం తీసుకునే వాడని తెలుస్తుంది…ఇక బిర్యానీ అంటే ప్రభాస్ కి చాల్ ఇష్టం అయినప్పటికీ ఎక్కడా టెంప్ట్ కాకుండా…దానికి దూరంగా ఉన్నాడట…అంతేకాదు….జిమ్ విషయంలో కూడా ఎప్పుడూ వదలకుండా….కొన్ని సార్లు శరీరం సహకరించనప్పటికీ…డే అండ్ నైట్ కష్టపడి బాడీ ని పెంచాడని బయటకు వస్తున్న వార్త…మొత్తానికి ప్రభాస్ కష్టానికి బాహుబలి1 మంచి ఫలితాన్ని ఇచ్చింది….మరి బాహుబలి2 ఏంచేస్తుందో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.















