Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • May 2, 2020 / 12:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

సున్నితమైన ప్రేమకథలు అద్భుతమైన విజయాలు అందుకున్న సందర్భాలు అనేకం. అలాంటి స్వచ్ఛమైన, ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ అమృతారామమ్. రామ్ మిట్టకంటి, అమిత రంగనాథ్ హీరో హీరోయిన్స్ గా దర్శకుడు సురేంధర్ తెరకెక్కించిన ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా అనేక కారణాలతో వాయిదాపడుతూ వస్తుంది. కరోనా వైరస్ కారణంగా థియేటర్స్ బంద్ ప్రకటించిన నేపథ్యంలో అమృతారామన్ సినిమాను డైరెక్ట్ గా ఓ టి టి ప్లాట్ ఫార్మ్ లో అందుబాటులోకి వచ్చింది. జి 5 లో ఈ చిత్రం స్ట్రీమ్ అవుతుండగా అలా విడుదలైన మొదటి చిత్రం అమృతారామమ్. మరి ఈ మూవీ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం…

Amrutharamam Movie Review1

కథ: రామ్‌ (రామ్‌ మిట్టకంటి) ఆస్ట్రేలియాలో మాస్టర్స్‌ పూర్తి చేసి, తన చదువుకు సరిపడా ఉద్యోగం వెతికే పనిలో ఉంటాడు. అదే సమయంలో అమృత (అమిత రంగనాథ్‌) మాస్టర్స్‌ చదివేందుకు ఆస్ట్రేలియా వస్తుంది. తొలిచూపులోనే రామ్ తో ప్రేమలో పడిపోతుంది అమృత. అతన్ని అమితంగా ఆరాధించే అమృత ప్రేమను రామ్ అంగీకరిస్తాడు. వీరి బ్యూటిఫుల్ లవ్ స్టోరీలో కొన్ని సంఘటనలు, నిర్ణయాలు వీరి మధ్య దూరం పెంచుతాయి. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని రామ్, అమృత ఎందుకు దూరం అయ్యారు? అసలు మళ్ళీ వాళ్లు కలిశారా.. లేదా? వీరిద్దరి ప్రేమ కథ చివరికి ఎలా ముగిసింది? అనేది మిగతా కథ..

Amrutharamam Movie Review2

నటీనటుల పనితీరు: అమృత పాత్ర చేసిన అమిత రంగనాథ్ నటన పరంగా గ్లామర్ పరంగా ఆకట్టుకుంది. ఓ అబ్బాయిని తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే అమ్మాయిగా తను సహజ నటన కనబరిచింది. ముఖ్యంగా పతాక సన్నివేశాలలో తన నటన ప్రేక్షుకులకు మంచి అనుభూతిని పంచుతుంది.

ఇక హీరో రామ్ కూడా ఫ్రస్ట్రేటెడ్ లవర్ పాత్రలో పర్వాలేదనిపించారు. ఐతే ఆయన నటనలో అంత మెచ్యూరిటీ కనబడలేదు. కొంచెం మెరుగవ్వాలన్న భావన కలిగింది. ప్రధాన పాత్రలు చేసిన అమిత, రామ్ మినహా సినిమాలో ఎవరి పాత్రలు ప్రేక్షకుడి మదిలో రిజిస్టర్ కావు. సినిమా చాలా వరకు దర్శకుడు వీరిపై నడిపించేశాడు.

Amrutharamam Movie Review3

సాంకేతిక వర్గం పనితీరు: అమృతారామమ్ మూవీలో మ్యూజిక్ చాల బాగుంది.సాంగ్స్ తో పాటు సన్నివేశాలకు తగ్గట్టుగా సాగే బీజీఎమ్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఆకట్టుకుంటాయి. సినిమా నేపథ్యం మొత్తం దాదాపు ఆస్ట్రేలియాలో సాగుతుంది. కెమెరా వర్క్ పరవాలేదు. ఎడిటింగ్ ఆకట్టుకోదు. డైలాగ్స్ బాగున్నాయి.

దర్శకుడు ఓ ఎమోషనల్ లవ్ స్టోరీని రొటీన్ సన్నివేశాలతో తెరకెక్కించి నిరాశపరిచాడు.

Amrutharamam Movie Review4

విశ్లేషణ: అమృతరామమ్ కొత్తదనం లేని ఓల్డ్ ఎమోషనల్ లవ్ డ్రామా అని చెప్పవచ్చు. లవ్ యట్ ఫస్ట్ సైట్ కి లోనైన అమ్మాయి రామ్ ని ప్రాణం కంటే ఎక్కవగా ప్రేమిస్తుంది. అమృత రామ్ ని అంతగా ఇష్టపడడానికి అక్కడ బలమైన కారణం ఉండదు. అలాగే వీరి మధ్య ప్రేమ మొదలయ్యే సన్నివేశాలలో కూడా అంత ఫీల్ లేకపోవడం ఒక మైనస్. ఇక హీరో హీరోయిన్ మధ్య ప్రేమ పుట్టడానికి బలమైన కారణాలు ఎలా లేవో వారు విడిపోవడానికి కూడా చెప్పుకో దగ్గర కారణాలు ఏమి కనిపించవు. దీనితో ఒకరంటే ఒకరికి ప్రాణమైన ప్రేమికుల మధ్య వచ్చే సిల్లీ గొడవలు, విడిపోవడాలు ప్రేక్షకులకు అనుభూతిని పంచవు. కేవలం ఆ రెండు పాత్రల పైనే శ్రద్ద పెట్టి సినిమా మొత్తం వారిపై నడిపించేశారు. దీనితో చాల సన్నివేశాలు రొటీన్ గా మరియి పదేపదే చూస్తున్న భావన కలుగుతుంది. ఐతే ఫస్ట్ హాఫ్ లో వీరిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు, పాటలు కొంచెం ఆహ్లాదం కలిగించే అంశాలు.

Amrutharamam Movie Review5

రేటింగ్: 2/5

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amitha Ranganath
  • #Amrutharamam Movie
  • #AmruthaRamam Review
  • #Ram Mittakanti
  • #Srijith Gangadharin

Also Read

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

related news

Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

Raid 2 Review in Telugu: రెయిడ్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Raid 2 Review in Telugu: రెయిడ్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Tourist Family Review in Telugu: టూరిస్ట్ ఫ్యామిలీ  సినిమా రివ్యూ & రేటింగ్!

Tourist Family Review in Telugu: టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా రివ్యూ & రేటింగ్!

Black, White & Gray – Love Kills Review in Telugu: బ్లాక్ వైట్ & గ్రే వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Black, White & Gray – Love Kills Review in Telugu: బ్లాక్ వైట్ & గ్రే వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

trending news

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

7 hours ago
#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

8 hours ago
Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

10 hours ago
Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

22 hours ago
Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

22 hours ago

latest news

Raj Rachakonda: చిన్న సినిమాల భవిష్యత్తును ఫిలిం ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదు!

Raj Rachakonda: చిన్న సినిమాల భవిష్యత్తును ఫిలిం ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదు!

2 hours ago
Thammudu: మోషన్ పోస్టర్ తో పాత్రలను పరిచయం చేసిన శ్రీరామ్ వేణు!

Thammudu: మోషన్ పోస్టర్ తో పాత్రలను పరిచయం చేసిన శ్రీరామ్ వేణు!

2 hours ago
నెల రోజులు కూడా అవ్వలేదు ఓటీటీకి వచ్చేస్తున్న కొత్త సినిమాలు !

నెల రోజులు కూడా అవ్వలేదు ఓటీటీకి వచ్చేస్తున్న కొత్త సినిమాలు !

3 hours ago
OTT రూల్ కు బ్రేక్ వేయబోతున్న బడా సినిమాలు!

OTT రూల్ కు బ్రేక్ వేయబోతున్న బడా సినిమాలు!

4 hours ago
Sai Pallavi: సాయి పల్లవి ఫైనాన్షియల్ ప్లాన్స్.. సెలబ్రిటీల్లో ఈ అలవాటు అరుదు!

Sai Pallavi: సాయి పల్లవి ఫైనాన్షియల్ ప్లాన్స్.. సెలబ్రిటీల్లో ఈ అలవాటు అరుదు!

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version