ఆర్తి అగర్వాల్ (Aarthi Agarwal) స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ఆమె రిఫరెన్స్ తో.. ఆమె చెల్లెలు అదితి అగర్వాల్ కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కె.రాఘవేంద్రరావు (Raghavendra Rao) దర్శకత్వంలో అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కిన ‘గంగోత్రి’ (Gangotri) చిత్రం ద్వారా ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అదితి గ్లామర్ (Aditi Agarwal) కి కూడా మంచి మార్కులు పడ్డాయి. కానీ ఎందుకో ఈమె క్లిక్ అవ్వలేదు. ఎం.ఎస్.నారాయణ (M. S. Narayana) కొడుకుతో ‘కొడుకు’ అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది.
ఆ తర్వాత ఒకటి, రెండు సీరియల్స్ లో కూడా నటించింది. మొత్తంగా సినిమా కెరీర్ ను సరిగ్గా ప్లాన్ చేసుకోకపోవడం వల్లే.. ఈమె క్లిక్ అవ్వలేదు అని చాలా మంది అనుకున్నారు. వాస్తవానికి ‘గంగోత్రి’ తర్వాత కృష్ణవంశీ (Krishna Vamsi) దర్శకత్వంలో కూడా అదితి అగర్వాల్ ఓ సినిమా చేయాలట. అది మరేదో కాదు ‘శ్రీ ఆంజనేయం’ (Sri Anjaneyam) . నితిన్ (Nithin Kumar) హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట అదితి అగర్వాల్ నే ఫిక్స్ చేశారు. కొంత పార్ట్ షూటింగ్ కూడా జరిపారు.
అయితే మితిమీరిన ఎక్స్పోజింగ్ చేయాల్సిన సీన్లు వివరిస్తున్నప్పుడు అవి ఆమెకు నచ్చలేదట. దీంతో దర్శకుడు కృష్ణవంశీకి ఆమెకు మధ్య మాట మాట పెరగడం వల్ల.. షూటింగ్ ఆగిపోయిందని తెలుస్తుంది. తర్వాత ఆమె స్థానంలో ఛార్మీని (Charmy Kaur) ఎంపిక చేసుకున్నాడు కృష్ణవంశీ. ‘శ్రీ ఆంజనేయం’ ప్లాప్ అయినా ఛార్మీ గ్లామర్ కి మంచి మార్కులు పడ్డాయి. తర్వాత ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. నేటితో ‘శ్రీ ఆంజనేయం’ రిలీజ్ అయ్యి 20 ఏళ్ళు పూర్తి కావస్తోంది.