మల్టీస్టారర్ సినిమాలంటే ఆ మధ్యలో ఏ హీరోలు చేసేవాళ్ళు కాదు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ , శోభన్ బాబు వంటి స్టార్స్ అనంతరం ఒక జనరేషన్ గా వెళ్లిన నాగార్జున , వెంకటేష్, చిరంజీవి, బాలకృష్ణ ఒక్క మల్టీస్టారర్ కూడా చేయకపోవడం టాలీవుడ్ కు తీరని తోటు. అప్పట్లో హీరోలకు ఈగోలు ఎంత ఉండేవో తెలియదు గాని అభిమానులకు అయితే ఒక రేంజ్ లో ఉండేవి. కృష్ణ, శోభన్ బాబు కాలంలోనే ఒక హీరో పాట వస్తే మరొక హీరో అభిమానులు లేచిపోయేవారు.
అంత దారుణంగా ఉండేది. అందుకే దర్శకులు ఆ తరువాత కాలంలో మల్టీస్టారర్ కథలను రిస్క్ లా ఫీల్ అయ్యే వారు. ఇక ప్రస్తుతం వెంకటేష్ వలన మళ్ళీ ఆ మల్టీస్టారర్ కళ ట్రాక్ లోకి వచ్చేసింది. అసలు మ్యాటర్ లోకి వెళితే ఒకనొక సమయంలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తన 100వ సినిమాగా ఒక మల్టీస్టారర్ సినిమా చేయాలని అనునున్నాడు. వెంకటేష్ – చిరంజీవి – నాగార్జున ముగ్గురి ఒప్పుకోవడంతో రైటర్ చిన్నికృష్ణతో పవర్ఫుల్ కథను రాయించారు.
త్రివేణి సంగమం అనే టైటిల్ కూడా అనుకున్నారు. ఈ ప్రాజెక్ట్ పై చర్చలు 2001 – 2002 మధ్యలో జరిగాయి. అయితే నిర్మాత అశ్వినిదత్ చర్చల సమయంలో ఒక మాట అన్నారట. ఎవరిని కాస్త తక్కువ చూపించినట్లు అనిపించినా కూడా పెద్ద తలనొప్పి.. అభిమానులతో మనకెందుకు వచ్చిన గొడవ.. అని చెప్పడంలో కె.రాఘవేంద్రరావు ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసి అల్లు అర్జున్ తో గంగోత్రి అనే సినిమా చేశాడు. ఆ విధంగా అశ్వినిదత్ చెప్పిన ఒక్క మాటతో ఒక బిగ్గెస్ట్ మూవీ తెరపైకి రాకుండా పోయింది. ఈ విషయాన్ని రాఘవేంద్రరావు సౌందర్య లహరి ఇంటర్వ్యూలో కూడా బయటపెట్టారు.