Prabhas,Nag Ashwin: ప్రభాస్ సినిమా కోసం రంగంలోకి దిగిన ఆనంద్ మహీంద్రా!

ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ ‘ప్రాజెక్ట్ K’ సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా విషయంలో దర్శకుడు నాగ్ అశ్విన్.. ఆనంద్ మహీంద్రాను రిక్వెస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘డియర్ ఆనంద్ మహీంద్రా సార్.. భారతీయ భాషల్లో సైన్స్ ఫిక్షన్ ‘ప్రాజెక్ట్ k’ను అత్యంత భారీ బడ్జెట్‌తో అమితాబ్ బచ్చన్, ప్రభాస్, దీపికలతో రూపొందిస్తున్నాం.

ఈ సినిమా కోసం సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నాం. ఇందుకు ప్రత్యేకంగా భారీ వాహనాలను తయారు చేయిస్తున్నాం. అవి నేటి సాంకేతికతకు మించి మరెన్నో ప్రత్యేకతలతో కూడుకొని ఉంటాయి. ఈ సినిమా అద్భుతంగా కుదిరితే.. అది మన దేశానికే గర్వకారణమవుతుంది. మాలో ప్రతిభావంతులైన వ్యక్తులు ఇంజినీర్లు అత్యుత్తమ డిజైనర్‌లు ఉన్నారు. కానీ, ఈ సినిమా అత్యంత భారీ స్థాయిలో రూపొందుతోంది. దీనికి మీ సహకారం కావాలి’ అని రాసుకొచ్చారు. ఇది చూసిన ఆనంద్ మహీంద్రా.. ‘ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని ఎలా తిరస్కరిస్తాం నాగ్ అశ్విన్..?

మా గ్లోబల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ చీఫ్ వేలు మహీంద్రా మీకు సాయం చేస్తారు. ఇప్పటికే ఆయన అధునాతన XUV700 వాహనాన్ని రూపొందించారు’ అంటూ బదులిచ్చారు. దీంతో నాగ్ అశ్విన్ థాంక్స్ చెబుతూ మరో ట్వీట్ చేశారు. అదే ట్వీట్ లో తనకు ఎలక్ట్రిక్ మొబిలిటీ ఎక్స్ పర్ట్స్ కూడా కావాలని కోరారు. మొత్తానికి ప్రభాస్ సినిమాకి సాయం చేయడానికి ఆనంద్ మహీంద్రాను సైతం రంగంలోకి దించుతున్నారు.

ఈ సినిమాలో ప్రభాస్ సూపర్ హీరో రోల్ లో కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. రీసెంట్ గానే అమితాబ్, దీపికా సినిమా షూటింగ్ షెడ్యూల్ లో పాల్గొన్నారు.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus