రామ్ (Ram) హీరోగా భాగ్య శ్రీ బోర్సే (Bhagyashree Borse) హీరోయిన్ గా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty) ఫేమ్ మహేష్ బాబు.పి (Mahesh Babu P) ఈ సినిమాకు దర్శకుడు. ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ ఎర్నేని(Naveen Yerneni), వై.రవిశంకర్ (Y .Ravi Shankar)..లు కలిసి ఈ చిత్రాన్ని ఎంతో ప్రెస్టీజియస్ గా నిర్మిస్తుంది. ఈ సినిమాకు సంబంధించి రామ్ లుక్ ఎలా ఉండబోతుంది అనేది ఇప్పటికే స్పష్టం చేశారు. మే 15న రామ్ పుట్టినరోజు ఉంది..
ఈ సందర్భంగా ఈ సినిమాకు (Rapo22) సంబంధించిన ఓ గ్లింప్స్ ను కూడా వదలనున్నారు. ఈ సినిమాకి ‘ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ అనే టైటిల్ అనుకుంటున్నారు’ అని కొన్నాళ్ల నుండి ప్రచారం జరుగుతుంది. ఫైనల్ గా ఆ టైటిల్ నే ఫిక్స్ చేస్తున్నట్టు తాజా సమాచారం. ఇదొక పీరియాడిక్ మూవీ. ఒక ఊరు, సినిమా నేపథ్యంలో సాగే కథతో రూపొందుతున్నట్లు తెలుస్తుంది. ఇందులో రామ్ ఓ స్టార్ హీరోకి అభిమాని.
అందుకే ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ఆ స్టార్ హీరోగా ఉపేంద్ర (Upendra Rao) కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. మొదట్లో ఆ పాత్ర కోసం రజినీకాంత్(Rajinikanth), మోహన్ లాల్(Mohanlal) , అరవింద్ స్వామి(Arvind Swamy), విజయ్ సేతుపతి (Vijay Sethupathi) వంటి ఎంతో మందిని సంప్రదించారు. ఫైనల్ గా ఉపేంద్రకి ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. రావు రమేష్ (Rao Ramesh), వీ టీవీ గణేష్ (VTV Ganesh) వంటి స్టార్లు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.