Anil Ravipudi : బాబాయి-అబ్బాయ్ కాంబినేషన్ లో 2027 సంక్రాంతికి రెడీ అవుతున్న అనిల్ రావిపూడి..?
- January 22, 2026 / 06:52 PM ISTByFilmy Focus Desk
గత కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సినిమా అంటే అనిల్ రావిపూడి సినిమా అనేలా బ్యాక్ తో బ్యాక్ హిట్స్ తో వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. 2025 సంక్రాంతి కి విక్టరీ వెంకటేష్ తో ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం తో ఇండస్ట్రీ హిట్ కొట్టి చూపించాడు అనిల్. అదే ఊపులో ఈ 2026 సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్ గా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించాడు. అనిల్ ఇక ఈ సారి కచ్చితంగా దొరికిపోతాడు అని కొంత మంది ప్రతీసారి అనుకోవటం, దానికి డైరెక్టర్ బ్లాక్ బస్టర్ తో సమాధానం ఇవ్వటం జరుగుతూ వస్తుంది. అయితే 2026 సంక్రాంతిని కూడా బ్లాక్ బస్టర్ తో కంప్లీట్ చేసిన అనిల్ రావిపూడి 2027 సంక్రాంతికి బాబాయి-అబ్బాయి కాంబో ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇంతకీ ఆ బాబాయి- అబ్బాయి కాంబో ఎవరో చూద్దామా..!
Anil Ravipudi
కెరీర్ బిగినింగ్ నుంచి అనిల్ రావిపూడి ఎక్కువగా రీపీట్ చేస్తూ డైరెక్ట్ చేసిన హీరో విక్టరీ వెంకటేష్. F2, F3, & సంక్రాంతికి వస్తున్నాం ఇలా మూడు బ్లాక్ బస్టర్స్ వీరిద్దరి కాంబోలో వచ్చాయి. అయితే 2027 సంక్రాంతికి మళ్ళీ తనకి బాగా కలిసివచ్చిన హీరో వెంకటేష్ తోనే సినిమా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇందులో హైలైట్ ఏంటంటే.. వెంకటేష్ తో పాటు రానా ని కూడా భాగం చేయనున్నారని టాక్. ఇదే నిజమైతే బాబాయి-అబ్బాయి కాంబోలో 2027 సంక్రాంతికి డైరెక్టర్ అనిల్ ఎదో పెద్దగా ప్లాన్ చేసినట్లు కనపడుతుంది. గతంలో వీరిద్దరు ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ లో నటించిన సంగతి తెలిసిందే.
















