Anil Ravipudi: ‘ఎఫ్‌ 3’ కోసం మరోసారి అనిల్‌ వెరైటీ కాన్సెప్ట్‌!

అనిల్ రావిపూడి సినిమాలో వినోదం కోసం ఏ ఒక్క ఛాన్స్‌ని కూడా వదులుకోరు అంటారు. ఆయన నుండి ఇప్పటివరకు వచ్చిన ప్రతి సినిమాలో వినోదాన్ని కుంబాలు కుంబాలు వడ్డించారు అనే చెప్పొచ్చు. ఈ క్రమంలో ప్రతి చిన్న సీన్‌నీ కామెడీకి అనుగుణంగా మార్చుకుంటూ వస్తారు ఆయన. ‘ఎఫ్‌ 2’లో ఆసనం పేరుతో వినోదాన్ని పండిండచం చూశాం. ఇప్పుడు ‘ఎఫ్‌ 3’లో అలాంటిదే మరో ప్రయోగం చేశారట అనిల్‌ రావిపూడి. ఆ విషయం ఆయన చెప్పారు.

‘ఎఫ్‌ 3’ సినిమాలో వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌ పాత్రల గురించి ఇప్పటికే వివరాలు బయటికొచ్చాయి. ఇందులో వెంకటేశ్‌కి రేచీకటి ఉంటుందని సమాచారం, వరుణ్‌తేజ్‌ పాత్రకు నత్తి ఉంటుందట. సినిమాలో ఫన్‌ను పీక్స్‌కి తీసుకెళ్లడానికే ఈ ప్రయత్నం చేశారు అని అర్థమవుతోంది. అయితే వరుణ్‌తేజ్‌కు పెట్టిన నత్తి డిఫెక్ట్‌ని మరింతగా వాడటానికి నత్తితో ఆయన ఇచ్చే పాజ్‌ టైమ్‌లో కూడా వినోదం పండించే ఏర్పాటు చేశారట అనిల్‌ రావిపూడి. వరుణ్‌ తేజ్‌ పాత్ర నత్తితో మాట్లాడటానికి ఇబ్బంది పడే సమయంలో…

ఆ విషయాన్ని కవర్‌ చేయడానికి సినిమాలో స్టెప్పులు వేస్తాడట. ట్రైలర్లో అలాంటిది ఒకటి చూడొచ్చు. అయితే ఈ పాజ్‌లో వచ్చే స్టెప్పులు ఏదో సరదాగా వేసేవి కావట, సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోల ఐకానిక్‌ స్పెప్పులు వేయిస్తున్నాడట. ఆ స్టెప్పులు చూస్తే కచ్చితంగా నవ్వొస్తుంది అనేలా ఉంటాయని చెప్పారు అనిల్‌ రావిపూడి. నత్తిగా డైలాగ్ చెప్పినప్పుడు చిన్న గ్యాప్ వస్తుంది కదా… ఆ గ్యాప్‌ను కవర్‌ చేయడానికి వరుణ్ తేజ్ రకరకాల స్టెప్పులేస్తుంటాడు.

దాదాపు అందరి హీరోల స్పెప్పులు ఈ సినిమాలో మీకు కనిపిస్తాయి అని చెప్పారు అనిల్‌ రావిపూడి. వీటితోపాటు వెంకటేశ్‌ వేసే ఫ్రస్టేషన్‌ కంట్రోల్‌ ఆసనాలు కూడా అదిరిపోతాయి అని చెప్పారు అనిల్‌ రావిపూడి. మరి ఆ స్టెప్పులేంటి, ఆసనాలేంటి… నత్తి, రేచీకటితో హీరోలు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి, తద్వారా ప్రేక్షకులను ఎలా అలరించారో తెలియాలంటే మే 27వరకు ఆగాల్సిందే. ఆ రోజే ఈ సమ్మర్‌ సోగ్గాళ్లు థియేటర్లకు వస్తున్నారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus