తారకరత్న ఇటీవల గుండెపోటుతో మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. జనవరి 27వ తేదీ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న తీవ్ర గుండెపోటు రావడంతో అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. దాదాపు 23 రోజులపాటు చికిత్స తీసుకొని మృత్యువుతో పోరాడిన తారకరత్న చివరికి తుది శ్వాస విడిచాడు. శనివారం ఆయన మరణించిన వార్త తెలియగానే నందమూరి కుటుంబ సభ్యులతో పాటు యావత్తు తెలుగు ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇక తాజాగా ఈయన అంత్యక్రియలు కూడా మహాప్రస్థానంలో పూర్తి అయ్యాయి.
తారకరత్న మృతి చెందడంతో ఈయన మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ క్రమంలో ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా తారకరత్న ఇంటికి చేరుకొని ఆయన పార్థివ దేహాన్ని దర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తారకరత్న గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. వీర సింహారెడ్డి సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో బాలకృష్ణ నటించనున్నాడు.
ఈ క్రమంలో బాలయ్య ఇటీవల అనిల్‌కు ఫోన్ చేసి.. సినిమాలో తారకరత్నకు మంచి క్యారెక్టర్ ఇవ్వాలని, తారకరత్నకి మంచి కమ్ బ్యాక్ అయ్యేలా పాత్ర ఉండాలని సూచించారు. ఆ ఏర్పాట్లలో ఉండగానే తారకరత్న ఇలా అకస్మాత్తుగా మృతి చెందారని అనిల్ రావిపూడి ఎమోషనల్ అయ్యారు. చిన్ననాటి నుండి బాలయ్యా, తారకరత్న మద్య మంచి అనుబంధం ఉంది.
అందుకే తారకరత్న బాలయ్య పేరుని టాటూ కూడా వేయించుకున్నారు. ఇక రాజకీయాలలో కూడ బాలయ్య ఆయనకి తోడుగా నిలవాలనుకున్నాడు. కానీ తారకరత్న అనారోగ్యం పాలవడంతో ఆయన వెన్నంటే ఉంటూ అన్నీ తానై చూసుకున్నాడు. కానీ 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న ఈ పోరాటంలో ఓడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఆయన మరణం నందమూరి కుటుంబంలో తీరని లోటు మిగిల్చింది.