సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. అయితే తమిళ సినిమాల పట్ల అతని కమిట్‌మెంట్ ఓ రేంజ్‌లో ఉంటే, టాలీవుడ్ చిత్రాలకు మాత్రం సమయాన్ని కేటాయించడంలో జాప్యం చేస్తున్నాడనే వాదన బయటకు వస్తోంది. నాని (Nani) నటిస్తున్న ది ప్యారడైజ్ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ అందించాల్సి ఉంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఇప్పటికే లాంచింగ్ ప్రోమోను సిద్ధం చేసినప్పటికీ, అనిరుధ్ స్కోర్ కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Anirudh
హై వోల్టేజ్ విజువల్స్‌కు అనుగుణంగా సంగీతం రావాలని టీమ్ ఎదురు చూస్తోంది. ఈ ఆలస్యం వల్ల సినిమా ప్రమోషన్ల షెడ్యూల్‌కూ మార్పులు రావాల్సి వచ్చింది. ఇదే పరిస్థితి విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) – గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) VD12 సినిమాకు కూడా ఎదురైంది. గౌతమ్, అనిరుధ్ మధ్య మంచి అనుబంధం ఉన్నప్పటికీ, బిజీ షెడ్యూల్ వల్ల టైటిల్ టీజర్ ఆలస్యమవుతోంది. ఇక మేజిక్ అనే మరో తెలుగు ప్రాజెక్ట్‌కి కూడా అనిరుధ్ మ్యూజిక్ అందించాల్సి ఉంది.
కానీ ప్రోమోలకే ఇంత ఆలస్యం అయితే, సినిమా విడుదలకు దగ్గరయ్యాక రీ-రికార్డింగ్ షెడ్యూల్ కోసం ఎంత ఇబ్బంది పడాల్సి ఉంటుందో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా, బాలకృష్ణ (Nandamuri Balakrishna) – గోపీచంద్ మలినేని (Gopichand Malineni) , చిరంజీవి (Chiranjeevi) – శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) ప్రాజెక్టులకు కూడా అనిరుధ్‌ను సంప్రదించారని సమాచారం. అయితే అతను ఇప్పటివరకు ఎస్ చెప్పలేదట.
కానీ నిర్మాతలకు మాత్రం తప్పకుండా వీటికి మ్యూజిక్ అందించాలని ఉందని, కొంత సమయం కావాలని చెప్పాడట. తమిళంలో జైలర్ 2, కూలి(Coolie) , జన నాయగన్ (Jana Nayagan), ఇండియన్ 3 వంటి భారీ సినిమాలు ఇప్పటికే అతని చేతిలో ఉండటం వల్ల, తెలుగు ప్రాజెక్టుల కోసం ఎంత టైమ్ కేటాయిస్తాడో అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి, అనిరుధ్ మ్యూజిక్ కోసం టాలీవుడ్ దర్శకులు ఓపిగ్గా ఎదురుచూస్తున్నారు.