టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘మహర్షి’ చిత్రంతో ఈ సమ్మర్ కి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇది మహేష్ బాబు కి 25 వ చిత్రం కాబట్టి… భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ చిత్రం ఏప్రిల్ 25 న విడుదలవుతుందని చిత్ర నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు ఇటీవల స్పష్టం చేసాడు. ఇక ఈ చిత్రం తరువాత సుకుమార్ డైరెక్షన్లో తన 26 వ చిత్రం చేయబోతున్నట్టు ప్రచారం జరిగింది. అయితే స్క్రిప్ట్ ను డెవలప్ చేయడానికి సుకుమార్… మరో 6 నెలలు సమయం కోరడంతో… ఆ చిత్రం ప్రస్తుతానికి వాయిదా పడింది. ఇక ఈ గ్యాప్ లో తన 26 వ చిత్రాన్ని అనిల్ రావిపూడి డైరెక్షన్లో చేయబోతున్నాడట మహేష్. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మించనున్నాడు.
ఇక ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిలింనగర్లో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే… ఈ చిత్రానికి కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందించబోతున్నాడట. అయితే ఈ వార్త ఇలా బయటికి వచ్చిందో లేదో… మహేష్ అభిమానుల్లో ఆందోళన మొదలయ్యింది. విషయంలోకి వెళితే… తమిళ మ్యూజిక్ డైరెక్టర్లతో గతంలో చేసిన మహేష్ బాబు చిత్రాలు… ‘నాని’ ‘సైనికుడు’ స్పైడర్’ చిత్రాలు ఘోరమైన డిజాస్టర్లుగా మిగిలాయి.
ఈ క్రమంలో మహేష్ బాబు మరోసారి తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తో వర్క్ చేయడం పై ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అనిరుథ్ మంచి మ్యూజిక్ ఇస్తాడు.. అందులో డౌట్ లేదు..! కానీ మన తెలుగు ప్రేక్షకులందరికీ చేరువవుతుందా.. అంటే అది సందేహమే. గతంలో వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ చిత్రానికి మంచి మ్యూజిక్ ఇచ్చాడు అనిరుథ్. కానీ ఆ పాటలు అందరికీ ఎక్కలేదు. మరి ఇలా రెండు రకాలు గాను మహేష్ బాబు… ప్లాప్ సెంటిమెంట్ ని వెతుక్కుంటూ వెళ్తున్నాడు అంటూ ఫిలింనగర్ విశ్లేషకులు కూడా చెప్పుకొస్తున్నారు.