Nagarjuna: నాగార్జున కొత్త సినిమాపై మరో కొత్త పుకారు.. క్లారిటీ ఇచ్చేస్తారా?

నాగార్జున కొత్త సినిమాకు దర్శకుడు ఎవరు? అనే ప్రశ్నకు ఆన్సర్‌ దొరికిపోయింది కానీ.. ఎప్పుడు సినిమా స్టార్ట్‌ అనే విషయంలో మాత్రం ఇంకా సమాధానం దొరకడం లేదు. ఇంతలో మరికొన్ని కొత్త ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తాజా పుకారు ప్రకారం చూస్తే ఈ సినిమాలో నాగార్జునతో పాటు మరో ఇద్దరు హీరోలు ఉంటారు. అయితే వాళ్లు స్టార్‌ హీరోలు మాత్రం కాదు. అందులో ఒక హీరో గురించి ఇప్పటికే సమాచారం ఉండగా, ఇప్పుడు కొత్త హీరో పేరు బయటకు వచ్చింది. అతను నాగార్జున నిర్మాణ సంస్థ నుండి బయటకు వచ్చినవాడే కావడం గమనార్హం.

‘ది ఘోస్ట్‘ సినిమా తర్వాత నాగార్జున ఏ ప్రాజెక్టుకు ఓకే చెప్పలేదు. ఆ సినిమా ప్రచారం సమయంలోనే ఆరు నెలల రెస్ట్‌ తీసుకుంటానని చెప్పారు. ఇప్పుడు ఆ టైమ్‌ పూర్తవుతోంది. దీంతో కొత్త సినిమా ఎప్పుడు మొదలు అనే మాట వినిపిస్తోంది. ఈ క్రమంలో రైటర్‌ ప్రసన్న కుమార్‌ని దర్శకుడుగా ప్రమోట్‌ చేస్తూ నాగ్‌ సినిమా చేస్తున్నాడని వార్తలొచ్చాయి. ఈ విషయాన్ని తర్వాత ఇంకొంతమంది ధ్రువీకరించారు కూడా. ఇప్పుడు ప్రసన్న ఆ కథ పని మీదే బిజీగా ఉన్నారట. అందులో భాగంగానే మరో హీరో పాత్ర అవసరం అని భావించారని టాక్‌.

మల్టీ స్టారర్‌గా నాగార్జున సినిమా తెరకెక్కుతుంది అనేది పాత విషయమే. తొలుత ఈ సినిమాలో నాగార్జునతోపాటు అల్లరి నరేశ్‌ నటిస్తారని వార్తలొచ్చాయి. ఇప్పుడు ఈ చిత్రంలో మరో యంగ్ హీరో రాజ్‌తరుణ్‌ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. వైవిధ్యమైన యాస, నటనతో ప్రేక్షకులను అలరించిన ఈ కుర్ర హీరో ఇప్పుడు నాగ్‌ సినిమాలో కీ రోల్ సంపాదించాడు అని చెబుతున్నారు. త్వరలోనే సినిమా టీమ్‌ నుండి ఈ మొత్తం విషయాల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు.

నాగార్జున కోసం ప్రసన్నకుమార్ పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో కథను సిద్ధం చేశారని టాక్‌. నాగార్జున కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కించనున్నారట. 70, 80ల కాలంనాటి పీరియాడికల్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోందని సమాచారం. ఈ మూవీని శ్రీనివాస్‌ చిట్టూరి నిర్మిస్తారట.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus