నందమూరి బాలకృష్ణ ఇటీవల ‘అఖండ’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు మరిన్ని సినిమాలు ఒప్పుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నారు బాలయ్య. ఈ సినిమా కథ గోపీచంద్ మలినేని చాలా కష్టపడ్డారు. కొన్ని రోజుల్లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అలానే బాలయ్య చేతిలో మరికొన్ని సినిమాలు ఉన్నాయి. ఇవి కాకుండా.. తాజాగా బాలయ్య మరో సినిమా ఒప్పుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. బాలకృష్ణకి చాలా కాలంగా శంకరాచార్య పాత్ర పోషించాలనుంది.
హైంధవ ధర్మాన్ని ప్రచారం చేసిన మహోన్నత వ్యక్తి. అతని జీవితాన్ని తెరపై చూపించాలన్నది బాలకృష్ణ ప్రయత్నం. దానికి సంబంధించిన కథ సిద్ధమవుతోంది సమాచారం. ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. గతంలో ఈయన బాలయ్యతో రెండు సినిమాలు తీశారు. ఇప్పుడు మూడో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు.
బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన శంకరాచార్య సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ రెడీ అవుతోందని.. బాలయ్య పర్మిషన్ ఇస్తే.. ఈ సినిమాను తనే నిర్మించాలనుకుంటున్నట్లు సి.కళ్యాణ్ వెల్లడించారు.