Project K Movie: ‘ప్రాజెక్ట్‌ కె’ కోసం నాగీ కొత్త ఆలోచనలు.. రంగంలోకి మరో స్టార్‌ హీరో?

దేశంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాల్లో భారీ చిత్రం అంటే ‘ప్రాజెక్ట్‌ K’ అని చెప్పొచ్చు. ఇది వర్కింగ్‌ టైటిల్‌ అనే విషయం తెలిసిందే. ఇటు బడ్జెట్‌, ఇటు కాస్టింగ్‌ అండ్‌ క్రూలో ఈ సినిమాను మించి భారీ సినిమా లేదని చెప్పొచ్చు. అయితే ఈ సినిమా కాస్టింగ్‌ విషయంలో ఇంకా దర్శకుడు లెక్కలు తీరలేదా? ఏమో ఆయన ఆలోచనలు అంటూ బయటకు వస్తున్న విషయాలు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. దానికి కారణం ఆయన సినిమాలో యాడ్‌ చేస్తున్న కొత్త అంశాలు, నటులే అంటున్నారు.

ప్రభాస్‌ హీరోగా, దీపికా పడుకొణె హీరోయిన్‌గా, అమితాబ్‌ బచ్చన్‌ ప్రధాన పాత్రలో దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న సినిమా ‘ప్రాజెక్ట్‌ కె’. ఈ సినిమాను వైజయంత్రీ మూవీస్‌, స్వప్న సినిమాస్‌ కలసి రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ఇందులో ఉన్న స్టార్‌ వాల్యూ పైన పేర్లు చదివినప్పుడే అర్థమైపోయుంటుంది. అయితే ఈ సినిమాకు దుల్కర్‌ సల్మాన్‌, ఎన్టీఆర్ లాంటి పేర్లు యాడింగ్‌ అవుతున్నాయని టాక్‌.

గ‌త ఏడాది సెట్స్ మీదికు వెళ్లిన ఈ సినిమా 2024 సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేయ‌నున్న‌ట్లు ఇటీవ‌లే ప్ర‌క‌టించారు. అయితే ఈ సినిమాలో దుల్కర్‌ కోసం ఓ స్పెషల్‌ క్యారెక్టర్‌ను నాగీ రాసుకున్నారని టాక్‌. అలాగే ఎన్టీఆర్‌తో పాత్రల పరిచయం చేయాలని అనుకుంటున్నారనీ సమాచారం. దీంతో ఈ సినిమాకు ఉన్న స్టార్‌ వాల్యూ సరిపోదా? ఇంకా పెంచాలా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే బడ్జెట్‌కి తగ్గ డబ్బు రావాలంటే ఈ మాత్రం తప్పనిసరి అంటున్నారు.

ఈ సినిమా కొత్త పోస్టర్‌లో The World is Waiting అనే క్యాప్షన్ పెట్టారు కూడా. ఓవైపు భారీ చేయి, స్పేస్ సూట్స్ లాంటివి వేసుకున్న మనుషులు చూస్తుంటే అసలు ఈ కథ మన గ్రహం మీద జరిగేదేనా అనే డౌట్‌ కూడా వస్తోంది. లేదంటే మన గ్రహం మీదకు వేరే గ్రహం నుండి ఎవరైనా వస్తే మన హీరో వాళ్లను ఎదిరించి కాపాడతాడా? లేక వేరే గ్రహం కష్టాల్లో ఉంటే మన హీరో అక్కడికి వెళ్తాడా అనేది తెలియడం లేదు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus