రాజమౌళి వెండితెరపై సృష్టించిన బాహుబలి కంక్లూజన్ ఏప్రిల్ 28 న ప్రపంచవ్యాప్తంగా 13,000 తెరలపై విడుదలై సంచలనం సృష్టిస్తోంది. నాలుగు భాషల్లో రిలీజ్ అయిన ఈ మూవీ తొలిరోజు దేశవ్యాప్తంగా 125 కోట్ల గ్రాస్ రాబట్టి ఔరా అనిపించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రోజుకో రికార్డు చొప్పున బద్దలు కొడుతోంది. తాజాగా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. నిన్నటితో ‘బాహుబలి-2’ 50 రోజుల రన్ ను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఎన్ని థియేటర్లలో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా 1076 స్క్రీన్లలో అర్థ శతదినోత్సవం పూర్తి చేసుకుని మరే భారతీయ చిత్రానికి సాధ్యం కాని ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పింది.
తెలుగు రాష్ట్రాలైన ఏపి, తెలంగాణాల్లో 281 స్క్రీన్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ముంబైలో 179, కేరళలో 102, తమిళనాడులో 120, కర్ణాటకలో 54, వెస్ట్ బెంగాల్ లో 45, ఓవర్ సీస్ లో 25 కలిపి మొత్తంగా దాదాపు 1076 స్క్రీన్లలో ఫిఫ్టీ డేస్ రన్ పూర్తిచేసుకుంది. రెండు వారాలకంటే ఎక్కువగా సినిమాలు థియేటర్లలో నిలవలేక పోతున్న ఈ సమయంలో వెయ్యి థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకోవడం గర్వించదగ్గ విషయం.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.