గత ఏడాది రిలీజ్ అయిన ‘దేవర’ (Devara) మంచి విజయాన్ని అందుకుంది. కానీ స్క్రీన్ ప్లే విషయంలో చాలా కంప్లైంట్స్ వచ్చాయి. ముఖ్యంగా దర్శకుడు కొరటాల శివ మార్క్ మిస్ అయ్యింది అని చాలా మంది విమర్శించారు. ఓటీటీ రిలీజ్ తర్వాత అవి బాగా ఎక్కువయ్యాయి. దీంతో కొరటాల శివ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
విషయంలోకి వెళితే.. ‘దేవర 2’ స్క్రిప్టులో భాగంగా దర్శకుడు కొరటాల శివ చాలా మార్పులు చేశారట. ముందుగా అనుకున్న కథ ఒకటి. మొదటి భాగానికి వచ్చిన రెస్పాన్స్ ను బట్టి.. కొన్ని కీలక మార్పులు చేసినట్లు తెలుస్తుంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బాగానే ఆడింది. హిందీలో కూడా పర్వాలేదు. కానీ తమిళంలో ఆడలేదు.
అక్కడ డిజాస్టర్ గా మిగిలిపోయింది. మలయాళంలో కూడా సేమ్ సీన్. ఆ విషయాలను కూడా దృష్టిలో పెట్టుకుని ‘దేవర 2’ స్క్రిప్ట్ లో ఎక్కువ మార్పులు చేసినట్లు తెలుస్తుంది. ఇందుకోసం మరో హీరోని పెట్టాలనే ఆలోచనకు కూడా టీం వచ్చినట్టు సమాచారం. కథలో అత్యంత కీలక పాత్రలో ఆ హీరో కనిపించాల్సి ఉంటుందట. దీనికోసం తమిళ స్టార్ హీరో శింబుని సంప్రదిస్తున్నట్టు తెలుస్తుంది.ఎన్టీఆర్ తో శింబుకి మంచి ఫ్రెండ్షిప్ ఉంది.
‘బాద్ షా’ సినిమాలో ఎన్టీఆర్ కోసమే ఓ పాట కూడా పాడాడు శింబు. సో అతని కోసం ‘దేవర 2’ లో నటించే అవకాశం ఉంది. మరోపక్క శింబు మేనియా ఇదివరకటితో పోలిస్తే ఇప్పుడు బాగా తగ్గింది. అయితే తమిళ, మలయాళంలో అతని సినిమాలకి మంచి క్రేజ్ ఉంది. అది ‘దేవర 2’ కి హెల్ప్ అవుతుంది. అయితే అధికారిక ప్రకటన వస్తే కానీ ఇది కన్ఫర్మ్ అనడానికి లేదు.