సినిమాలో నటించడం మినహా ప్రమోషన్స్ లేదా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కి తాను రానని ఒక సినిమా ఒప్పుకొనేప్పుడు అగ్రిమెంట్ లోనే రూల్ ఇచ్చేస్తుంది నయనతార. ఆమెకు స్టార్ డమ్ ఉంది కాబట్టి ఆమె ఎన్ని రూల్స్ పెట్టినా, ఫాలో అయినా సరిపోతుంది. కానీ.. అను ఎమ్మాన్యుల్ లాంటి కొత్త హీరోయిన్స్ ఆ తరహా రూల్స్ ఫాలో అవుతానంటే ఎలా?. ఇది అను ఎమ్మాన్యూల్ ఫాలో అవుతున్న సెంటిమెంటా రూలా అనే విషయంలో క్లారిటీ లేకపోయినప్పటికీ.. అమ్మడు తాను నటించిన సినిమాకి కాస్త నెగిటివ్ టాక్ వచ్చిందంటే ఆ సినిమా ప్రమోషన్స్ కి చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తోంది. అందుకు నిదర్శనమే “అజ్ణాతవాసి, నా పేరు సూర్య” చిత్రాలు.
ఈ రెండు సినిమాలకు సంబంధించి రిలీజ్ కి ముందు తన ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ లో భీభత్సంగా ప్రమోట్ చేసిన అను ఎమ్మాన్యూల్ సినిమా రిలీజ్ తర్వాత ఫ్లాప్ టాక్ రావడంతో కనీసం సినిమా గురించి ఒక్కటంటే ఒక్క పోస్ట్ కూడా వేయలేదు. ఇక మొన్న పవన్ కళ్యాణ్ ను చీఫ్ గెస్ట్ గా పిలిచి మరీ థ్యాంక్స్ మీట్ నిర్వహించింది “నా పేరు సూర్య” బృందం.. ఈ ఈవెంట్ కి కూడా అను ఎమ్మాన్యూల్ దూరంగా ఉంది. అడిగితే పర్సనల్ ఇష్యూస్ అంటూ వివరణ ఇచ్చింది. తనకు మొదటి డిజాస్టర్ ఇచ్చిన పవన్ కళ్యాణ్, రెండో ఫ్లాప్ ఇచ్చిన బన్నీ ఇద్దరూ ఒకే స్టేజ్ మీద ఉన్నప్పుడు, తాను మధ్యలో ఉండడం కరెక్ట్ కాదనుకుందో ఏమో కానీ.. అను ప్రమోషన్స్ కి హ్యాండ్ ఇవ్వడం పట్ల చిత్రబృందం మాత్రం ఫుల్ సీరియస్ గా ఉంది.