Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #మన శంకరవరప్రసాద్ గారు రివ్యూ
  • #అనగనగా ఒక రాజు రివ్యూ

Filmy Focus » Featured Stories » అప్పట్లో ఒకడుండేవాడు

అప్పట్లో ఒకడుండేవాడు

  • December 30, 2016 / 07:39 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అప్పట్లో ఒకడుండేవాడు

“ప్రేమ ఇష్క్ కాదల్” ఫేమ్ శ్రీవిష్ణు కథానాయకుడిగా, నారా రోహిత్ ఎక్స్ టెండెడ్ క్యామియో రోల్ ప్లే చేసిన సినిమా “అప్పట్లో ఒకడుండేవాడు”. 1990 నేపధ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి “అయ్యారే” ఫేమ్ సాగర్ దర్శకుడు. విడుదలకు రెండ్రోజుల ముందే పలువురికి ప్రత్యేక ప్రదర్శనల ద్వారా సినిమా చూపించి పాజిటివ్ ఫీడ్ బ్యాడ్ తెచ్చుకొన్న ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు అలరించగలుగుతుందో చూద్దాం..!!

కథ : రైల్వే రాజు (శ్రీవిష్ణు) డిస్ట్రిక్ట్ లెవల్ క్రికెటర్, ఎప్పటికైనా రంజీ ట్రోఫీకి ఇండియా తరపున ఆడాలన్నది అతడి కల. అయితే.. అతడి ఆశయానికి లోకల్ పోలీస్ ఆఫీసర్ ఇంతియాజ్ (నారా రోహిత్) అడ్డు పడుతుంటాడు. దానికి కారణం రైల్వే రాజు అక్క అహల్య (మానస హిమవర్ష) నక్సలైట్ సౌత్ జోన్ హెడ్ అయిన సవ్యసాచి (రవివర్మ)ను పెళ్లి చేసుకొని.. అన్నలతో కలిసిపోవడం.

ఆమెను పట్టుకోవడం కోసం రైల్వే రాజుకు ఎంతో ఇష్టమైన క్రికెట్ ను దూరం చేస్తాడు ఇంతియాజ్. క్రికెట్ తోపాటు తాను ప్రేమిస్తున్న అమ్మాయి కూడా దూరమయ్యే పరిణామం ఎదురవ్వడంతో కంగారులో చేసిన తప్పు కారణంగా క్రికెటర్ నుంచి రౌడీగా మారిపోతాడు. ఆ తర్వాత అతడి జీవితంలో ఎదుర్కొన్న సమస్యలేమిటి? ఇంతియాజ్ ను ఎలా ఎదుర్కొన్నాడు? వంటి ప్రశ్నలకు సమాధానమే “అప్పట్లో ఒకడుండేవాడు”.

నటీనటుల పనితీరు : ఇంతియాజ్ పాత్రలో డార్క్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ను తన నటనతో రంజింపజేశాడు. ఒక యువ హీరో అయ్యుండి ఇలాంటి నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ ను అంగీకరించడంతోపాటు సినిమాను నిర్మించడం, తన పాత్ర నిడివి గురించి పట్టించుకోకపోవడం వంటి విషయాలను మెచ్చుకొని తీరాలి. యాక్టివ్ సీన్స్ లో పర్లేదు కానీ.. ఎమోషనల్ సీన్స్ లో మాత్రం తేలిపోయాడు శ్రీవిష్ణు. క్రికెటర్ గా పర్లేదు అనే స్థాయిలో నటించినా గ్యాంగ్ లీడర్ గా మాత్రం అలరించలేకపోయాడు. ముఖ్యంగా తన కుమార్తెను 20 ఏళ్ల తర్వాత కలుసుకొనే సన్నివేశాన్ని తన నటనతో పండించలేకపోయాడు. తాన్య హోప్ కి తన నాటచాతుర్యం చూపే అవకాశం పెద్దగా లభించలేదు, ఉన్న కొన్ని సన్నివేశాల్లో హీరో కౌగిలిలో ఒదిగిపోవడం మినహా పెద్దగా చేసిందేమీ లేదు. బ్రహ్మాజీకి పాత్రకి డెప్త్ అనేది పెద్దగా లేకపోయినా విట్టల్ సేట్ గా కథలో కీలకపాత్ర పోషించాడు. అలాగే అజయ్, రాజ్యలక్ష్మి, మానస హిమవర్ష, రవివర్మల పాత్రలు చిన్నవే అయినప్పటికీ.. వారి పరిధి మేరకు పర్వాలేదనిపించుకొన్నారు.

సాంకేతికవర్గం పనితీరు : సాయికార్తీక్ సమకూర్చిన బాణీల కంటే సురేష్ బొబ్బిలి బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. కొన్ని సినిమాల నుంచి కాపీ కొట్టినప్పటికీ.. సన్నివేశంలోని ఎమోషన్ ను హైలైట్ చేయగలిగాడు. నవీన్ యాదవ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఫ్లైకామ్ షాట్స్ లో క్రికెట్ ప్లే గ్రౌండ్ సీన్ ను చక్కగా ఎలివేట్ చేశాడు. అయితే నిర్మాణ విలువల కారణంగా కొన్ని సన్నివేశాలను మాత్రం సరిగా పిక్చరైజ్ చేయలేకపోయాడు. అరణ్ మీడియా నిర్మాణ విలువలు యావరేజ్ గా ఉన్నాయి. అందువల్ల 1990 నాటి పరిస్థితులను, ప్రదేశాలను పూర్తి స్థాయిలో రీక్రియేట్ చేయడంలో విఫలమయ్యారు.

దర్శకుడు సాగర్ చంద్ర “అయ్యారే” అనంతరం తెరకెక్కించిన చిత్రం “అప్పట్లో ఒకడుండేవాడు”. రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్ టైనర్ లా కాకుండా ఈ చిత్రాన్ని డిఫరెంట్ గా ట్రీట్ చేద్దామనుకొన్న ఆలోచన, ఆ ఆలోచన కోసం 1992-1996 నడుమ జరిగిన రాజకీయ, అంతర్జాతీయ అంశాలను గురించి పూర్తి స్థాయిలో రీసెర్చ్ చేసి సదరు సంఘటనలను కథనంలో ఇన్వాల్వ్ చేయడం వరకూ బాగానే ఉంది కానీ.. వాటి కారణంగా కథను విధవిధాలుగా వంకర్లు తిప్పడమే ప్రేక్షకులను కాస్త కన్ఫ్యూజ్ చేస్తుంది. సగటు ప్రేక్షకుడికి కావాల్సిన ఎంటర్ టైన్మెంట్ లేకపోవడం, రెండు గంటల నిడివిగల సినిమాలో కూడా ల్యాగ్ లు ఉండడం వంటివి పెద్ద మైన్స్ లు.

విశ్లేషణ : “అప్పట్లో ఒకడుండేవాడు” మంచి ప్రయత్నంగా మిగిలిపోయే సినిమా. నారా రోహిత్ నటన, బ్రాగ్రౌండ్ స్కోర్ మాత్రమే సినిమాలో ఉన్న ఏకైక ప్లస్ పాయింట్ లు. సో, లాజిక్ లు పట్టించుకోకుండా ఓ రెండు గంటలపాటు మధ్యలో బోర్ కొట్టినా టైమ్ పాస్ చేయాలనుకొనేవారే ఈ సినిమాను చూడొచ్చు!

రేటింగ్ : 2/5

Click Here For ENGLISH Review

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Appatlo Okadundevadu
  • #appatlo okadundevadu movie
  • #Appatlo Okadundevadu Movie Rating
  • #Appatlo Okadundevadu Movie Review
  • #Appatlo Okadundevadu Review

Also Read

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’.. ఇదే లాస్ట్ పవర్ ప్లే

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’.. ఇదే లాస్ట్ పవర్ ప్లే

Bhartha Mahasayulaku Wignyapthi Collections: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలంటే?

Bhartha Mahasayulaku Wignyapthi Collections: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలంటే?

Anaganaga Oka Raju Collections: 11వ రోజు కూడా ఆల్మోస్ట్ కోటి వసూలు చేసింది

Anaganaga Oka Raju Collections: 11వ రోజు కూడా ఆల్మోస్ట్ కోటి వసూలు చేసింది

Nari Nari Naduma Murari Collections: 10వ రోజు కూడా అదరగొట్టిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: 10వ రోజు కూడా అదరగొట్టిన ‘నారీ నారీ నడుమ మురారి’

Mana ShankaraVaraprasad Garu Collections: ‘మన శంకర వరప్రసాద్ గారు’ వసూళ్లు… ఈ వీకెండ్ కూడా మాస్ బ్యాటింగ్

Mana ShankaraVaraprasad Garu Collections: ‘మన శంకర వరప్రసాద్ గారు’ వసూళ్లు… ఈ వీకెండ్ కూడా మాస్ బ్యాటింగ్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కొడుకు పై డీప్ ఫేక్ వీడియోలు.. హైకోర్టుని ఆశ్రయించిన అకీరా

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కొడుకు పై డీప్ ఫేక్ వీడియోలు.. హైకోర్టుని ఆశ్రయించిన అకీరా

related news

Venkatesh Daggubati: వెంకటేష్ సినిమాలో నారా రోహిత్

Venkatesh Daggubati: వెంకటేష్ సినిమాలో నారా రోహిత్

అటు హీరో.. ఇటు ఫ్యాన్ బాయ్.. ఇద్దరూ సేమ్ టు సేమ్

అటు హీరో.. ఇటు ఫ్యాన్ బాయ్.. ఇద్దరూ సేమ్ టు సేమ్

trending news

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’.. ఇదే లాస్ట్ పవర్ ప్లే

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’.. ఇదే లాస్ట్ పవర్ ప్లే

17 hours ago
Bhartha Mahasayulaku Wignyapthi Collections: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలంటే?

Bhartha Mahasayulaku Wignyapthi Collections: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలంటే?

18 hours ago
Anaganaga Oka Raju Collections: 11వ రోజు కూడా ఆల్మోస్ట్ కోటి వసూలు చేసింది

Anaganaga Oka Raju Collections: 11వ రోజు కూడా ఆల్మోస్ట్ కోటి వసూలు చేసింది

18 hours ago
Nari Nari Naduma Murari Collections: 10వ రోజు కూడా అదరగొట్టిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: 10వ రోజు కూడా అదరగొట్టిన ‘నారీ నారీ నడుమ మురారి’

18 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: ‘మన శంకర వరప్రసాద్ గారు’ వసూళ్లు… ఈ వీకెండ్ కూడా మాస్ బ్యాటింగ్

Mana ShankaraVaraprasad Garu Collections: ‘మన శంకర వరప్రసాద్ గారు’ వసూళ్లు… ఈ వీకెండ్ కూడా మాస్ బ్యాటింగ్

19 hours ago

latest news

Tamil Directors: ఇద్దరు ఇన్‌.. ఒకరు లైన్‌లో.. చెన్నైలో నెక్స్ట్‌ ఫ్లైట్‌ ఎక్కబోయే దర్శకుడు ఎవరు?

Tamil Directors: ఇద్దరు ఇన్‌.. ఒకరు లైన్‌లో.. చెన్నైలో నెక్స్ట్‌ ఫ్లైట్‌ ఎక్కబోయే దర్శకుడు ఎవరు?

17 hours ago
Skn: ‘జాతిని..’ అంటూ అప్పుడు గొంతు చించుకున్నాడు.. ఇప్పుడు కంప్లైంట్‌ ఇచ్చాడు

Skn: ‘జాతిని..’ అంటూ అప్పుడు గొంతు చించుకున్నాడు.. ఇప్పుడు కంప్లైంట్‌ ఇచ్చాడు

17 hours ago
Jennifer Lopez: ఆయన బయోపిక్‌లో జెన్నిఫర్‌ లోపేజ్‌ పాట.. అంత స్పెషలేంటంటే?

Jennifer Lopez: ఆయన బయోపిక్‌లో జెన్నిఫర్‌ లోపేజ్‌ పాట.. అంత స్పెషలేంటంటే?

18 hours ago
Nikhil Siddhartha: నిఖిల్ సిద్ధార్థ్ సక్సెస్ సెంటిమెంట్.. ఆలస్యమైనా అదృష్టమేనా..

Nikhil Siddhartha: నిఖిల్ సిద్ధార్థ్ సక్సెస్ సెంటిమెంట్.. ఆలస్యమైనా అదృష్టమేనా..

19 hours ago
Tollywood: నాన్ పాన్ ఇండియా రికార్డ్స్.. ఆ ఇద్దరితో పాటు మెగాస్టార్

Tollywood: నాన్ పాన్ ఇండియా రికార్డ్స్.. ఆ ఇద్దరితో పాటు మెగాస్టార్

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version