సూపర్ స్టార్ రజినీకాంత్, ఏఆర్ రెహ్మాన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు మంచి మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. రజినీకాంత్ నటించిన ‘ముత్తు’, ‘శివాజీ’, ‘రోబో 2.0’ ఇలా కొన్ని సినిమాలకు మ్యూజిక్ అందించాడు రెహ్మాన్. అయితే రజినీకాంత్ సినిమాలకు పనిచేయడమంటే నరకంలా ఫీల్ అయ్యేవాడినని షాకింగ్ కామెంట్స్ చేశాడు రెహ్మాన్. వీరిద్దరి కాంబినేషన్ లో హిట్ ఆల్బమ్ రావడం వెనుక చాలా కష్టాలు దాగున్నాయని.. అప్పటి విషయాలను గుర్తుచేసుకున్నాడు రెహ్మాన్.
ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రెహ్మాన్.. రజినీకాంత్ సినిమాల వర్క్ ఎక్స్ పీరియన్స్ గురించి మాట్లాడారు. ఆయన సినిమాలకు పనిచేయడమంటే నరకంలా భావించేవాడినని చెప్పాడు. ఇప్పట్లో కొంచెం నయం అని.. అప్పట్లో రజినీకాంత్ సినిమాలన్నీ దీపావళికి విడుదలయ్యేవని.. తను మార్చిలో వర్క్ మొదలుపెడితే సాంగ్స్, బీజియమ్స్ మొత్తం కంపోజ్ చేసేసరికి టైం సరిపోయేది కాదని అన్నారు. అందరూ ఆల్బమ్ అదిరిపోవాలని చెప్పడంలో.. ఆ తక్కువ సమయంలో మంచి అవుట్ పుట్ కోసం చాలా ఒత్తిడి తీసుకునేవాడ్ని అంటూ చెప్పుకొచ్చాడు.
అదే సమయంలో వేరే ప్రాజెక్ట్స్ ఒప్పుకోవడంతో వేరే సినిమాల మేకర్స్ వచ్చి.. తమ సినిమా కూడా అదే టైంకి వస్తుందని గుర్తుచేసేవారని.. దెబ్బకి పండుగలంటే చిరాకు వచ్చేసేదని అన్నారు. ఒకప్పుడు దీపావళి, పొంగల్, న్యూఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి సమయం ఉండేది కాదని గుర్తుచేసుకున్నారు.