ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలయికలో రూపుదిద్దుకున్న అరవింద సమేత వీర రాఘవ సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్లోకి రానుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్ ప్రోమోల ద్వారా కథ ఎలా ఉంటుందో కాస్త అర్ధమయింది. రాయలసీమ నేపథ్యం లో సాగే కథని ముందుగానే స్పష్టం చేశారు. అయినా ఇంకా సినిమా గురించి ఆరా తీసేవారు లేకపోలేదు. అందుకే ఈ మూవీని చిత్ర యూనిట్ తో పాటు సెన్సార్ సభ్యులు చూసారు. వారి నుంచి సినిమాలో ప్రముఖులు పోషించిన పాత్రల గురించి ఆరా తీయగా.. కొన్ని బయటికి వచ్చాయి. అవి ఏమిటంటే..
ఎన్టీఆర్ : కడప కుర్రాడు. ఫ్యాక్షనిస్టు గొడవల్లో ఇమడలేక హైదరాబాద్ వచ్చేస్తాడు.
సునీల్ : ఆటో గ్యారేజ్ యజమాని. హైదరాబాద్ లో ఎన్టీఆర్ కు ఆశ్రయం ఇస్తాడు.
సీనియర్ నరేష్ : హీరోయిన్ తండ్రి. లాయర్. తన దగ్గరకు వచ్చిన క్లయింట్ లు అందరినీ రకరకాలుగా వాడేసే ఫన్నీ క్యారెక్టర్.
పూజా హెగ్డే : నరేష్ కూతురు. ఈమెను పోకిరీల నుంచి రక్షించడం ద్వారా హీరో పరిచయం అవుతాడు.
జగపతి బాబు : కడపకు చెందిన భయంకరమైన ఫ్యాక్షనిస్టు.
నవీన్ చంద్ర : ఫ్యాక్షనిస్టు జగపతిబాబు కొడుకు. హీరో చేతిలో దెబ్బలు తినే క్యారెక్టర్.
వీరు మాత్రమే కాకుండా .. ఇందులో నటించిన ప్రతి ఒక్కరి పాత్రకి త్రివిక్రమ్ విలువ ఇచ్చారని తెలిసింది.