దాదాపు 12 ఏళ్ళ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల ఆకలిని ‘ఓజి’తో తీర్చాడు దర్శకుడు సుజిత్. సెప్టెంబర్ 25న విడుదలైన ఈ సినిమా మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా పర్వాలేదు అనిపించింది. ‘అత్తారింటికి దారేది’ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన ఏ సినిమా కూడా బ్రేక్ ఈవెన్ అంచుల వరకు వెళ్ళలేదు. కానీ ‘ఓజి’ చాలా వరకు రికవరీ చేసింది. కమర్షియల్ లెక్కల సంగతి ఎలా ఉన్నా.. చాలా కాలం నుండి పవన్ కళ్యాణ్ ను అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించి సక్సెస్ అయ్యాడు సుజిత్.
వాస్తవానికి ‘ఓజి’ అనౌన్స్ చేసినప్పుడు ఎవరికీ కూడా పెద్దగా అంచనాలు లేవు. ఎందుకంటే సుజిత్ ‘సాహో’ తో ప్లాప్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ ఎలాగూ ప్లాపుల్లో ఉన్నాడు. అందుకే ఈ ప్రాజెక్టు పై అంచనాలు లేవు. కానీ ఎప్పుడైతే గ్లింప్స్ రిలీజ్ అయ్యిందో. లెక్కలన్నీ మారిపోయాయి. హైప్ పెరిగిపోయింది.

దానికి మెయిన్ రీజన్ అంటే.. గ్లింప్స్ లో అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ అనే చెప్పాలి. ‘అలాంటోడు మళ్ళీ తిరిగొస్తున్నాడు అంటే..’ అనే ఒక్క డైలాగ్ సినిమాపై బజ్ అమాంతం పెరిగేలా చేసింది. ప్రమోషన్స్ కూడా అవసరం లేదు అనే రేంజ్లో సినిమాకి బిజినెస్ కూడా భారీగా జరిగింది. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అర్జున్ దాస్ వాయిస్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. సినిమాలో కూడా అతని పాత్ర అత్యంత కీలకంగా ఉంటుంది.

అయితే ఈ పాత్రకి ఫస్ట్ ఛాయిస్ అర్జున్ దాస్ కాదట. ఓ స్టార్ హీరో రిజెక్ట్ చేస్తే.. దర్శకుడు సుజిత్.. అర్జున్ దాస్ ను తీసుకున్నాడట. ఆ స్టార్ హీరో మరెవరో కాదు మలయాళం స్టార్ హీరో టోవినో థామస్. అవును మలయాళం మార్కెట్ కోసం అతన్ని సంప్రదించాడట సుజిత్. కానీ అతను వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల అర్జున్ దాస్ ని ఫైనల్ చేశాడట. అది మేటర్.
