బాహుబలి తర్వాత ఆ ఘనత అర్జున్ రెడ్డిదే
- August 21, 2017 / 12:46 PM ISTByFilmy Focus
సినిమా మీద విపరీతమైన నమ్మకం ఉన్న దర్శకనిర్మాతలు సైతం ఒకరోజు ముందు తమ చిత్రానికి సంబంధించిన స్పెషల్ షోలు వేయడానికి నిరాకరిస్తుంటారు. ఎక్కడ టాక్ బయటకి వచ్చేస్తే సినిమా కలెక్షన్స్ మీద ఆ ఎఫెక్ట్ పడుతుందో అని, కానీ.. మొట్టమొదటిసారిగా “బాహుబలి” దర్శకనిర్మాతలు ఆ డేర్ చేసి విడుదలకి ఒకరోజు ముందు రాత్రే స్పెషల్ షో వేశారు. అదంటే అంతర్జాతీయ స్థాయి సినిమా కావడం, బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకోవడంతో సంచలనాలు సృష్టించింది.
కానీ.. విజయ్ దేవరకొండ లాంటి యంగ్ హీరో నటించిన “అర్జున్ రెడ్డి” సినిమాకి కూడా ఒకరోజు ముందే ప్రీమియర్ షోలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశం అయ్యింది. అయితే.. ఈ సినిమా విషయంలో మెయిన్ ట్విస్ట్ ఏంటంటే సినిమా నిడివి 175 నిమిషాలు అనగా రెండు గంటలా 55 నిమిషాలు. ఇంటర్వెల్ తో కలిపి 3.15 గంటల సినిమా అన్నమాట. మరి ఇంత నిడివి ఉన్న సినిమా ప్రీమియర్స్ ద్వారా వచ్చే టాక్ ను బట్టి నెక్స్ట్ డే కలెక్షన్స్ ఆధారపడి ఉంటాయి. మరి భారీ హైప్ తో విడుదలవుతున్న ఈ సినిమా ఆడియన్స్ ను ఏమేరకు అలరిస్తుందో తెలియాలంటే మాత్రం ఇంకో రెండ్రోజులు ఆగాల్సిందే.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.














