మరో 4 రోజుల్లో ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ (Arjun Son Of Vyjayanthi) సినిమా రిలీజ్ కాబోతోంది. కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి (Vijaya Shanthi) కూడా కీలక పాత్ర పోషించారు. ఏప్రిల్ 18న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. టీజర్, ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ రావడం వంటి అంశాలు సినిమాపై బజ్ క్రియేట్ అయ్యేలా చేశాయి. ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్(Jr NTR).. ‘నేను మాత్రమే కాదు ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ అన్న కూడా కాలర్ ఎగరేస్తాడు’ అంటూ చెప్పడంతో అంచనాలు భారీగా పెరిగాయి.
అయితే ఈ మొత్తంలో దర్శకుడు ప్రదీప్ చిలుకూరి (Pradeep Chilukuri) గురించి ఎవ్వరూ ఎక్కువగా చెప్పుకోలేదు. ‘ఇతను ఎవరు, ఇతను ఏం చేసేవాడు’ వంటి విషయాలు చాలా మందికి తెలీదు. ఇలాంటి టైంలో రిలీజ్ కి తక్కువ రోజులు వ్యవధి ఉండటంతో అతను విలేకర్ల సమావేశంలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో అతను తన కెరీర్ గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు చెప్పుకొచ్చాడు.
వాస్తవానికి ప్రదీప్ చిలుకూరి మొదటి సినిమా ఇది కాదు. 2016 లో నారా రోహిత్ (Nara Rohit) హీరోగా వచ్చిన ‘రాజా చెయ్యి వేస్తే’ (Raja Cheyyi Vesthe) సినిమా. అందులో తారకరత్న (Taraka Ratna) విలన్ గా నటించాడు. ఆ సినిమా వచ్చి వెళ్లినట్టు చాలా మందికి తెలీదు. ఎందుకంటే అది ప్లాప్ సినిమా. స్టోరీ లైన్ బాగానే ఉంటుంది కానీ కథనం తేడా కొట్టింది. ఈ ఫలితం పై దర్శకుడు ప్రదీప్ కూడా స్పందించాడు. ఆ సినిమా చివరి దశలో ఉన్నప్పుడు రషెస్ చూసుకుంటే అతనికే నచ్చలేదట.
ఫలితాన్ని ముందే ఊహించినట్టు చెప్పాడు. తర్వాత ఇద్దరు పెద్ద హీరోలతో సినిమాల కోసం అడ్వాన్సులు కూడా తీసుకున్నాడట. కానీ ఆ ప్రాజెక్టులు సెట్ అవ్వలేదట. దీంతో కెరీర్లో గ్యాప్ వచ్చినట్టు తెలిపాడు. కానీ ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ కచ్చితంగా ఆడియన్స్ ని మెప్పిస్తుందని, తల్లీ కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ అందరికీ కనెక్ట్ అవుతాయని… చెప్పుకొచ్చాడు ప్రదీప్.