న్యాచురల్ స్టార్ నాని (Nani) ఈసారి ప్రేక్షకులను గమ్మత్తుగా కాదు, ఘోరంగా షాక్‌కు గురి చేయనున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న హిట్ 3 (HIT 3) ట్రైలర్ తాజాగా విడుదలై సంచలనం రేపుతోంది. శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ మూవీలో నాని బ్రూటల్ పోలీస్ ఆఫీసర్‌గా అర్జున్ సర్కార్ అనే పాత్రలో దర్శనమిచ్చాడు. ఆయన లుక్, యాటిట్యూడ్, యాక్షన్ చూపిస్తూ రూపొందించిన ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.
ట్రైలర్ అంతా డార్క్ మూడ్‌లో సాగుతుంది. స్టైలిష్ ఫ్రేమ్స్, బలమైన లైటింగ్ స్కీమ్స్‌తో విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. నాని చెప్పే డైలాగ్స్ చక్కటి మాస్స్ టచ్‌తో ఉండగా, “అబ్కి బార్ అర్జున్ సర్కార్” అనే డైలాగ్ హైలైట్‌గా నిలుస్తోంది. జనాల మద్యలో ఉంటే అర్జున్.. మృగాల మద్యలో ఉంటే సర్కార్..అంటూ ట్రైలర్ నానిలోని మరో కోణాన్ని చూపించడంలో పూర్తిగా విజయం సాధించింది. కథపై క్లారిటీ ఇవ్వకుండా, క్యారెక్టర్‌ను ఎలివేట్ చేయడంలో ఫోకస్ చేయడం ట్రైలర్ ప్రత్యేకత.
ఈ సినిమాలో నానికి ఓ ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్ కూడా ఉంది. అర్జున్ సర్కార్ కఠినమైన పోలీస్ అయినప్పటికీ, అతడి మనసులో ప్రేమ ఎమోషన్ కూడా ఉండడం ఆసక్తికరంగా ఉంటుంది. చాగంటి ప్రవచనంతో మిక్స్ చేసిన నానీ క్యారెక్టర్ బలంగా కనిపిస్తోంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో మిక్కీ జే మేయర్ (Mickey J Meyer) తన స్థాయిలో వర్క్ చేశాడు. ట్రైలర్‌కు సంగీతం గూజ్‌బంప్స్ తెప్పించేలా ఉంది. హిట్ ఫ్రాంచైజీలో ఇది మూడో సినిమా. మొదటి రెండు భాగాలకు మంచి స్పందన వచ్చినప్పటికీ, ఈసారి మాత్రం మాస్ రేంజ్‌ను పెంచేలా ప్రయత్నించారు.
నాని ఈ పాత్రలో పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్ అయిపోయినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. నిర్మాత ప్రశాంతి త్రిపినేని (Prashanti Tipirneni) నిర్మాణ విలువల్లో ఎలాంటి రాజీ పడకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. సినిమాకు భారీ స్థాయిలో టెక్నికల్ మద్దతు ఉంది. మొత్తానికి హిట్ 3 (HIT3 ) ట్రైలర్ చూసినవారు “నాని ఊచకోత గట్టిగానే ఉంటుంది” అని ఖచ్చితంగా చెబుతున్నారు. మే 1న ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది. ట్రైలర్ క్రేజ్ చూస్తే హిట్ 3 ఫ్రాంచైజీకి ఇదే గోల్డెన్ హిట్ అవుతుందనే నమ్మకాన్ని ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు.