మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న పాన్ ఇండియా మూవీ పెద్ది (Peddi) షూటింగ్ వేగంగా జరుగుతుండడం ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) ఈ సినిమాను స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిస్తున్నారు. మొదటి నుంచే సినిమాపై మంచి అంచనాలు ఉండగా, ఇప్పుడు బుచ్చిబాబు వేగవంతమైన పనితీరు మెగా ఫ్యాన్స్‌కు మూడింతలు ఎక్కువగా నమ్మకం కలిగిస్తోంది. ఇప్పటికే రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన సీన్లు జులై లేదా ఆగస్టు నాటికి పూర్తయ్యేలా షెడ్యూల్ ప్లాన్ చేశారట.
చరణ్ డేట్స్‌ను మాక్స్ జెట్ స్పీడ్ పో ఉపయోగించుకునేందుకు బుచ్చిబాబు స్పెషల్ ప్లానింగ్‌తో ముందుకు వెళ్లుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఈ సినిమాలోని క్లైమాక్స్ ఎమోషనల్ సీన్స్ ఇప్పటికే షూట్ చేశారు. అవే సినిమాకు హైలైట్‌గా నిలవబోతున్నాయట. ఈ సినిమా కథ ఓ పల్లెటూరి యువకుడి నుంచి క్రికెట్ ప్రపంచంలో చరిత్ర సృష్టించే వరకు సాగుతుంది. ఇందులో కామెడీ సీన్స్ కూడా ప్రత్యేకంగా ఉండబోతున్నాయట. ప్రస్తుతం బుచ్చిబాబు ఎమోషనల్ పార్ట్‌పై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారని తెలుస్తోంది.
చరణ్ నటన చూసి యూనిట్ సభ్యులు ఆశ్చర్యపోతున్నారని టాక్. చరణ్ లుక్ కూడా ఈ సినిమాలో పూర్తిగా కొత్తగా ఉండబోతోంది. ఈసారి అతని పెర్ఫార్మెన్స్ ఎంతో ఇంటెన్స్‌గా ఉంటుందని టీమ్ చెబుతోంది. ఇక సినిమా తర్వాత నిర్మాణానంతర పనులకు దాదాపు మూడు నెలలు కేటాయించనున్నట్టు తెలుస్తోంది. డబ్బింగ్, గ్రాఫిక్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మొదలైన వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టబోతున్నారట.
ఈ సినిమాలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తుండగా, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ (A.R.Rahman) ప్రత్యేక మ్యూజికల్ టచ్ ఇవ్వబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా 2026లో రిలీజ్ కానుంది. షూటింగ్ వేగం చూస్తే బుచ్చిబాబు – చరణ్ కాంబో బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని అభిమానులు నమ్ముతున్నారు.