Ashish Reddy: దిల్ రాజు గురించి హీరో ఆశిష్ ఆసక్తికర వ్యాఖ్యలు.!

  • May 23, 2024 / 09:16 PM IST

‘లవ్ మీ’ (Love Me) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఆశిష్ (Ashish Reddy) . మొదటి సినిమా ‘రౌడీ బాయ్స్’ (Rowdy Boys) తో పర్వాలేదు అనిపించినా బాక్సాఫీస్ వద్ద అది సక్సెస్ ఫుల్ మూవీగా నిలబడలేదు. పైగా సంక్రాంతి సీజన్, దిల్ రాజు (Dil Raju) బ్యానర్లో సినిమా కాబట్టి.. ఆ రిజల్ట్ అయినా వచ్చింది. కానీ ఇప్పుడు అతనికి అసలు సిసలైన పరీక్ష మొదలు కాబోతుంది. మే 25 న ‘లవ్ మీ’ సినిమా రిలీజ్ కాబోతోంది. రెండు వారాలుగా సరైన సినిమా లేకపోవడంతో ప్రేక్షకులు కూడా థియేటర్లకు రావడం లేదు.

ఇలాంటి టైంలో ‘లవ్ మీ’ రావడం రిస్క్ అనే ఆలోచన అందరిలోనూ ఉంది. అయినా సరే ఆశిష్ ఇదే మంచి టైం అంటూ ట్రైలర్ లాంచ్ లో చెప్పుకొచ్చాడు. మరో పక్క సినిమాని అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్నాడు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. పైగా రెండో సినిమాకే అతను చాలా మెచ్యూర్డ్ గా సమాధానాలు చెబుతుండటం విశేషంగా చెప్పుకోవాలి. అతను పాల్గొన్న అన్ని ఇంటర్వ్యూల్లో ఒక ప్రశ్న కామన్ గా వినిపించింది.

అదే ‘బ్యాక్ గ్రౌండ్ ఉంది కదా అని హీరో అయ్యారా?’ అని..! దానికి అతను మెచ్యూర్డ్ ఆన్సర్ ఇచ్చాడు. ‘కేవలం బ్యాక్ గ్రౌండ్ చూసుకుని నేను సినిమాల్లోకి అడుగుపెట్టలేదు. హీరో అవ్వాలనుకునే ముందు దిల్ రాజు గారు నాకు చాలా టెస్టులు పెట్టారు. అందులో పాసయ్యాకే హీరోగా లాంచ్ చేశారు. ‘ప్రేక్షకులను మెప్పించడం ఈజీ.. దిల్ రాజుని మెప్పించడమే కష్టం’ అని నాకు తర్వాత తెలిసొచ్చింది. నాకు నటనపై ఆసక్తి ఉంది. అందుకే మనస్ఫూర్తిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాను’ అంటూ ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus