Ashok Galla: సూపర్ స్టార్ అభిమానులకు ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు, మహేష్ బాబు మేనల్లుడు, గుంటూరు ఎం.పి. జయదేవ్ గల్లా కొడుకు అయిన అశోక్ గల్లా హీరోగా ఎంట్రీ ఇవ్వబతున్న సంగతి తెలిసిందే. అతని డెబ్యూ మూవీని శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేస్తున్నాడు. గతంలో శ్రీరామ్ ఆదిత్య ‘భలే మంచి రోజు’ ‘శమంతకమణి’ ‘దేవదాస్’ వంటి చిత్రాలను తెరకెక్కించాడు. అమర రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై పద్మావతి గల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు, నరేష్, సత్య, కార్తీక దీపం ఫేం అర్చన సౌందర్య … కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఇక ఈ చిత్రం నుండీ టీజర్ ను జూన్ 23 న విడుదల చేయబోతున్నారు. ఇటీవల అశోక్ గల్లా హార్స్ రైడింగ్ చేస్తున్న పోస్టర్ ను విడుదల చేయగా దానికి మంచి స్పందన లభించింది. దీంతో టీజర్ కూడా సినిమా పై ఆసక్తిని పెంచే విధంగా ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.

జిబ్రాన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.వెన్నెల కిషోర్ కామెడీ కూడా ఈ చిత్రంలో హైలెట్ గా నిలుస్తుందని సమాచారం. నిజానికి ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది.. కానీ కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల షూటింగ్ వాయిదా పడింది.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus