Bigg Boss Telugu OTT: అసలు అషూరెడ్డి బాధకి తేజస్విని కారణమా..? ఏం జరిగింది..?

బిగ్ బాస్ హౌస్ లో నాన్ స్టాప్ లైవ్ అనేది ఒక రోజు బ్రేక్ పడింది. బుధవారం రాత్రి 12గంటలకి ఆగిన లైవ్ మళ్లీ తిరిగి గురువారం రాత్రి 12గంటలకి స్టార్ట్ అయ్యింది. దీంతో ఇప్పుడు లైవ్ అనేది ఒక రోజు లేట్ గా నడుస్తుంది. దీన్ని బిగ్ బాస్ నిర్వాహకులు ప్రతిరోజూ 45నిమిషాల పాటు రాత్రి 9గంటలకి ఫుల్ ఎపిసోడ్ అంటూ స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎపిసోడ్ 10 ని లేట్ గా స్ట్రీమింగ్ చేశారు. నిజానికి సీనియర్స్ అండూ జూనియర్స్ ఇద్దరికీ మార్నింగ్ యాక్టివిటీలో భాగంగా టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.

సీనియర్స్ వాళ్ల సీజన్ లో గేమ్ ని ఎనలైజ్ చేయమని, ఎందుకు వాళ్లు ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చిందో కారణాలని తెలపమని చెప్పాడు. ఇక్కడే అషూరెడ్డికి తేజస్వినికి గట్టి ఆర్గ్యూమెంట్ అయ్యింది. అంతేకాదు, అరియానాతో తన మనసులో మాటల్ని షేర్ చేస్కుంది అషూ. ఏదైనా కిచెన్ లో తను చాలా రూడ్ గా మాట్లాడుతోందని, తను తన సీజన్ నుంచీ ఏం నేర్చుకుందని ప్రశ్నించింది. తర్వాత హౌస్ మేట్స్ అందరూ కలిసి వింత వస్తువులు అనే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో పాల్గొన్నారు. ఈ పోటీలో అషూరెడ్డి తనకి ఇచ్చిన బొమ్మని దిగ్విజంగా తీసింది.

ఒక రౌండ్ లో పార్టిసిపేట్ చేసింది. ఇక్కడే సీనియర్స్ జూనియర్స్ పైన పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగించారు. వారికి ఒక్క పాయింట్ కూడా ఇవ్వకుండా గెలిచారు. దీంతో సీనియర్స్ నుంచీ ఏకాభిప్రాయంతో ఇద్దర్నీ కెప్టెన్సీ పోటీదారులుగా ఎంచుకోండని బిగ్ బాస్ చెప్పాడు. సీనియర్స్ ఓటింగ్ ప్రకారం అరియానా ఇంకా అఖిల్ ఇద్దర్నీ ఎంచుకున్నారు. తేజస్విని మాత్రం అరియానా ఇంకా అకిల్ పేర్లు చెప్పింది. అలాగే అషూరెడ్డికి కేవలం మహేష్ విట్టా ఇంకా ముమైత్ ఖాన్ ఇద్దరు మాత్రమే ఓటు వేశారు. దీంతో అషూరెడ్డి చాలా బాధపడింది. అనిల్ ఇంకా స్రవంతిలతో కలిసి తన మనసులో బాధని పంచుకుంది.

ఎంత ఎఫెర్ట్ పెట్టి ఆడినా కూడా డీమోటివేట్ చేస్తునే ఉంటారని వాపోయింది. ఇలా చేస్తే ఎలా ఎంత బాగా ఆడినా కూడా డీమోటివ్ చేస్తున్నారని ఎంతో బాగా ఆడదామని వచ్చానని బాధపడింది. నెక్ట్స్ వీక్ అయినా కెప్టెన్సీ కోసం ట్రై చేస్తానని చెప్పింది. అంతేకాదు, నైట్ లైట్స్ అన్నీ ఆర్పేశాక బెడ్ పైన కూర్చుని బొమ్మని పట్టుకుని ఏడ్చింది. నిజానికి తనకి ఓట్లు పడనందుకు బాధపడిందా ? లేదా తేజస్వినితో జరిగిన ఆర్గ్యూమెంట్ కి బాధపడిందా అన్నట్లుగా మనసులో చాలా బాధపడి ఏడ్చింది అషూరెడ్డి. అదీ మేటర్.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus