‘బిగ్ బాస్3’ విన్నర్ పై దాడి వెనుక అసలు కథ!

ప్రముఖ సింగర్ మరియు ‘బిగ్ బాస్3’ విన్నర్ అయిన రాహుల్ సిప్లిగంజ్ పై కొందరు యువకులు దాడి చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. దీనికి పాత గొడవలే కారణమా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. రాహుల్ కు గచ్చిబౌలి లోని ప్రిజమ్ పబ్ కు వెళ్ళే అలవాటు. తన స్నేహితులతో ఎప్పుడూ అక్కడికి వెళ్తుంటాడు. చాలా కాలం తర్వాత నిన్న ఓ అమ్మయితో అతను ఆ పబ్ కు వెళ్ళాడు. ఈ క్రమంలో రాహుల్ వెంట వచ్చిన అమ్మాయిని కొందరు టీజ్ చేయడం మొదలు పెట్టారు. దీంతో రాహుల్ కు కోపం వచ్చి వెళ్ళి వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అంతే అలా మాటా.. మాటా పెరిగి గొడవ పెద్దదైంది. ఈ క్రమంలో కొందరు బీర్ బాటిల్స్ తో రాహుల్ తల పై దాడి చేసారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే ఈ గొడవ అమ్మాయి కోసం జరిగింది కాదట.. గతంలో రాహుల్ కొంతమంది దగ్గర డబ్బులు తీసుకుని ప్రోగ్రాం చేయకపోవడమే అని టాక్ నడుస్తుంది. దీంతో రాహుల్ ఎప్పుడు ఒంటరిగా దొరుకుతాడా అని ఎదురు చూస్తున్న వారికి.. నిన్న రాత్రి కలిసొచ్చింది. అంతే.. ఇదే సరైన అవకాశం అని వారు దాడి చేసినట్టు తెలుస్తుంది. రాహుల్ పై దాడి వెనుక వికారాబాద్ కు చెందిన ఓ ఎం.ఎల్.ఏ హస్తం కూడా ఉందని చర్చ జరుగుతుంది. ఇక గాయపడిన రాహుల్ ను.. ఆ పబ్ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు రాహుల్ క్షేమంగానే ఉన్నట్టు తన స్నేహితుడు నోయల్ తన సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.

‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus