పండుగ నాడు సందడి చేయబోతున్న 6 సినిమాలు ఇవే..!

కాస్త విరామం తర్వాత సీనియర్, యంగ్ హీరోలందరూ వరుసగా సినిమాలు చేస్తున్నారు.. కంటిన్యూస్ షూటింగులతో ఫుల్ బిజీగా ఉన్నారు.. ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఓవైపు, క్రేజీ కాంబినేషన్స్‌తో అంచనాలు పెంచేస్తున్న మూవీస్ మరోవైపు రిలీజ్ డేట్స్ లాక్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాయి.. మీరెప్పుడైనా విడుదల చేసుకోండి కానీ మాకు మాత్రం ఓ అప్‌డేట్ ఇవ్వండి అంటూ ఫ్యాన్స్ సామాజిక మాధ్యమాల ద్వారా దర్శకనిర్మాతలను విన్నవించుకుంటున్నారు.. దీంతో రాబోయే ఉగాది పండుగ నాడు అభిమానుల ఎదురు చూపులకు తెరపడనుందని.. కొత్త సినిమాల నుండి స్పెషల్ అప్ డేట్స్ రాబోతున్నాయని తెలుస్తోంది.. అవేంటో ఇప్పుడు చూద్దాం..

1) SSMB 28

మహేష్ బాబు – త్రివిక్రమ్ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండే భారీ అంచనాలున్నాయి.. గతకొద్ది రోజులుగా అఫీషియల్ అప్ డేట్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.. ఉగాది సందర్భంగా ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రానుందని సమాచారం..

2) ఆదిపురుష్..

గ్లోబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ డెబ్యూ మూవీ ‘ఆదిపురుష్’ జెట్ స్పీడ్‌తో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.. జూన్ 16న గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.. ఉగాది పర్వదినాన ‘ఆదిపురుష్’ నుండి ఓ స్పెషల్ అప్ డేట్ ఇవ్వనున్నారు టీమ్..

3) NBK 108..

బాలయ్య – అనిల్ రావిపూడి కలయికలో తెరకెక్కుతున్న చిత్రం NBK 108.. కాజల్ అగర్వాల్ కథానాయికగా.. శ్రీలీల బాలయ్య కూతురిగా నటిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ఉగాది నాడు ప్రకటించనున్నారట..

4) ఏజెంట్..

అఖిల్ అక్కినేని కెరీర్‌లో తెరకెక్కుతున్న ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం ‘ఏజెంట్’.. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ ఫిలిం ఏప్రిల్ 28న విడుదల కానుంది.. తెలుగు సంవత్సరాది రోజు ఓ స్పెషల్ అప్ డేట్ ఇవ్వనున్నారట టీమ్..

5) RC 15..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో రూపొందున్న RC 15 కి సంబంధించిన టైటిల్ ఉగాది నాడు.. రామ్ చరణ్ బర్త్‌డేకి టీజర్ విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట శంకర్..

6) భోళా శంకర్..

మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ కాంబోలో ‘వేదాళం’ రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా అప్ డేట్ కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఈ నేపథ్యంలో ఉగాది రోజు సర్‌ప్రైజ్ ఇవ్వనున్నారని తెలుస్తోంది..

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus