GOAT: ‘గోట్‌’కి ‘అవతార్‌’ టీమ్‌ వర్క్‌… ఏం చేస్తున్నారంటే?

విజయ్‌ (Vijay Thalapathy) ఇంకా ఎన్ని సినిమాలు చేస్తాడు అనే విషయంలో ఎలాంటి క్లారిటీ ఉండటం లేదు. త్వరలో రాజకీయాల్లోకి వస్తాను అని ఆ మధ్య పార్టీని ప్రకటించాడు కూడా. ఈ లెక్కన ఇప్పుడు చేస్తున్న వెంకట్‌ ప్రభు సినిమా సెమీఫైనల్‌ అవుతుంది అని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఫలితం మీద భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టే ఈ సినిమా గురించి టీమ్‌ చాలా కష్టపడుతోంది. అంతేకాదు సినిమా కోసం అంతర్జాతీయ నిపుణులను కూడా తీసుకొస్తున్నారు.

‘అవతార్‌’, ‘అవెంజర్స్‌’ లాంటి హాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ సినిమాలకు పని చేసిన టీమ్‌ను ‘గోట్‌: గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’ (The Greatest of All Time)  సినిమాకు హైర్‌ చేసుకుంటున్నారట. ఆ సినిమాలకు విజువల్‌ ఎఫెక్ట్స్‌ అందించిన సాంకేతిక నిపుణులు ఇప్పుడు ఈ చిత్రానికీ పని చేయనున్నారట. ఈ విషయాన్ని క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ అర్చనా కళ్పతి సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశారు. ‘గోట్‌’ (GOAT) సినిమాలో వీఎఫ్‌ఎక్స్‌కి అత్యధిక ప్రాధాన్యం ఉంది. హీరో విజయ్‌ కోసం ప్రత్యేకంగా ‘డీ – ఏజింగ్‌ టెక్నాలజీ’ వాడి పాతికేళ్ల కుర్రాడిగా చూపించబోతున్నాం.

దీని కోసం అమెరికాలోని లాస్‌ఏంజెలిస్‌లోని ప్రముఖ స్టూడియో నిపుణులకు ఈ పనులు అప్పగించారట. త్వరలోనే టీమ్‌ పనులు వేగవంతం చేస్తుంది అని చెబుతున్నారు. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబరు 5న ప్రేక్షకుల ముందుకొస్తోంది. యువన్‌ శంకర్‌రాజా (Yuvan Shankar Raja) బాణీలు సమకూర్చుతున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) కథానాయికగా నటిస్తోంది. వెంకట్‌ప్రభు (Venkat Prabhu) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విజయ్‌ పాత్ర చిత్రణ ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.

ఎందుకంటే వెంకట్‌ ప్రభు హీరోలు సగటు సినిమాల హీరోలకు భిన్నంగా ఉంటారు. అలాగే ఈ సినిమాలో దివంగత కెప్టెన్‌ విజయ్‌ కాంత్‌ను ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా నటింపజేశారు అని అంటున్నారు. త్వరలో ఈ విషయంలో ఓ టీజర్‌ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. అయితే అలాంటిదేం లేదు ఆ సర్‌ప్రైజ్‌ థియేటర్లలోనే అని చెబుతున్నారు మరికొందరు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus