మార్చి 11, బుధవారం నాడు మొదటి సాంగ్ ఏయ్ పిల్లా విడుదల!

హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంట గా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ ‘‘లవ్ స్టోరీ’’.సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఏమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. మ్యూజికల్ లవ్ స్టోరీగా రాబోతున్న లవ్ స్టోరీ నుండి ఇటీవల విడుదలైన 1 మినిట్ మ్యూజికల్ ప్రివ్యూ ‘‘ఏయ్ పిల్లా’’ అనే సాంగ్ ప్రివ్యూ కు మంచి ఆదరణ లభించింది. “ఏయ్ పిల్లా” ఫుల్ లిరికర్ వీడియోను మర్చి 11న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు.హోలీ సందర్భంగా కొత్త పోస్టర్ ను విడుదల చేసింది టీం.ఇందులో బైక్ మీద కూర్చున్న హీరో నాగ చైతన్య తో హీరోయిన్ సాయి పల్లవి ఎదో టీజ్ చేస్తున్నట్టుగా ఉన్న తీరు క్యూట్ గా ఉంది.సోషల్ మీడియా లో ఈ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న లవ్ స్టొరీ ఈ వేసవి లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

“ఫిదా” తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న ఈ అందమైన ప్రేమకథ అక్కినేని అభిమనుల్లో, ప్రేక్షకుల్లో ఆసక్తి రేపింది. నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీలో రాజీవ్ కనకాల,ఈశ్వరీ రావు,దేవయాని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Most Recommended Video

‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus