బాహుబలి కంక్లూజన్ బాక్స్ ఆఫీస్ వద్ద కలక్షన్ల తుఫాన్ సృష్టించింది. గత నెల 28 న ప్రపంచవ్యాప్తంగా 9,000 థియేటర్లలో విడుదలైన ఈ మూవీ తొలిరోజు నుంచి వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఫస్ట్ డే 125 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ మూవీ అప్పటి వరకు ఉన్న రికార్డులను తుడిచిపెట్టింది. ఇప్పుడు ఫస్ట్ వీక్ రికార్డులను సైతం చెరిపివేసింది. దేశవ్యాప్తంగా 695కోట్ల గ్రాస్ వసూలు చేయగా, 545 కోట్ల నెట్ సొంతం చేసుకుంది. ఓవర్సీస్ లోను బాహుబలి ప్రభంజనం మామూలుగా లేదు. వారం రోజుల్లో 165 కోట్ల గ్రాస్ రాబట్టింది. దీంతో రాజమౌళి, ప్రభాస్ కలయికలో వచ్చిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 860 కోట్ల గ్రాస్ తో భారతీయ చలన చిత్ర చరిత్రలో సరికొత్త రికార్డును నెలకొల్పింది.
బాలీవుడ్ లో..
గతంలో (హిందీ) ‘దంగల్’ ఏడు రోజుల్లో 197.54 కోట్లు, ‘సుల్తాన్’ తొమ్మిది రోజుల్లో 229.16 కోట్లు వసూలు చేయగా.. ‘బాహుబలి 2’ ఏడు రోజుల్లో 247 కోట్లు రాబట్టిందని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు. ‘బాహుబలి 2’ హిందీలో తొలిరోజున (శుక్రవారం) 41 కోట్లు, శనివారం 40.50 కోట్లు, ఆదివారం 46.50 కోట్లు, సోమవారం 40.25, మంగళవారం 30 కోట్లు, బుధవారం 26 కోట్లు, గురువారం 22.75 కోట్లు మొత్తం 247 కోట్లు వసూలు చేసినట్లు పేర్కొన్నారు.తెలుగు రాష్ట్రాల్లో 117. 13 కోట్ల షేర్ ను రాబట్టింది. ఏరియా వారీగా..
ఏరియా కలెక్షన్లు
నైజాం : 35.39 కోట్లు
సీడెడ్ : 20. 45 కోట్లు
ఉత్తరాంధ్ర : 15. 12 కోట్లు
ఈస్ట్ : 11. 97 కోట్లు
వెస్ట్ : 9. 29 కోట్లు
క్రిష్ణా : 8. 39 కోట్లు
గుంటూరు : 11. 95 కోట్లు
నెల్లూరు : 4. 57 కోట్లు మొత్తం 117. 13 కోట్లు
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.