దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి కంక్లూజన్ యాభై రోజులు పూర్తి చేసుకొని చిత్ర బృందంలో ఆనందాన్ని నింపింది. ఈ సందర్భంలో మరో అరుదైన గౌరవం అందుకొని సంతోషాన్ని రెట్టింపు చేసింది. ఈ నెల 22 నుంచి 29 వరకు జరగనున్న మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ సినిమాను ప్రారంభ చిత్రంగా ప్రదర్శించనున్నారు. ఫిలిం ఫెస్టివల్ ఓపెనింగ్ రోజు వచ్చే అతిధులందరికీ బాహుబలి – ది కంక్లూజన్ చిత్రాన్ని ప్రత్యేకంగా చూపించబోతున్నారు. ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో బాహుబలి-2ను ప్రత్యేకంగా షో వేశారు.
ఈ మధ్యే ముగిసిన కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో బాహుబలి-2 స్పెషల్ స్క్రీనింగ్ వేశారు. కొన్ని రోజుల కిందట రొమేనియాలో కూడా ఈ సినిమాను ప్రదర్శించారు. ఇప్పుడు మాస్కోలో కూడా సినీ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్ గా ప్రదర్శితం కానుంది. అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఏ తెలుగు సినిమాకి దక్కని గౌరవం బాహుబలికి దక్కుతుండడంతో ప్రభాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.