పరిస్థితి మారిందా? బాహుబలి పై క్రేజ్ తగ్గిందా? హైప్ విషయంలో బాహుబలి వెనుక బడ్డాడా? అంటే అవును అనే మాట బలంగా వినిపిస్తుంది…విషయంలోకి వెళితే…అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుందిగా…మాకు మేమే సాటి…మాకు మేమే పోటీ అని…అలాగా బహుబలి విషయానికి వస్తే…ఈ సినిమాపై అంచనాలు భారీగా కనిపిస్తూ ఉన్నప్పటికీ…తొలి భాగానికి…ఏ భాగానికి చాలా తేడా ఉంది అంటున్నారు…ఈ విషయమై కాస్త విశ్లేషణలోకి వెళితే…తాజాగా…ఒక పోల్ నిర్వహించి అందులో జనం ఎదురు చూస్తున్న అతి ఇంపార్టెంట్ సినిమా ఏది అంటూ ఆప్షన్స్ పెడితే బాహుబలి రెండో భాగం టాప్ ప్లేస్ లో దూసుకుపోయింది…అదే క్రమంలో ఆన్‌లైన్ విషయం పక్కన పెడితే…బాహుబలి రెండో భాగం పై జనాల్లో కాస్త హైప్ తగ్గుతోంది అన్న సంగతి టాలీవుడ్ సర్కిల్స్ నుంచి బలంగా వినిపిస్తుంది…అయితే దానికి గల కారణాలు ఏంటి అంటే…రకరకాల కారణాలు చెబుతున్నారు ప్రేక్షక దేవుళ్ళు.
ప్రమోషన్ విషయంలో ఈ టీం రెండో భాగం లో చాలా స్లో గా లైట్ గా వెళుతున్నారు. బాహుబలి1 కోసం బోలెడంత వర్క్ చేశారు. రెండు నెలల ముందు నుంచి మొదలు పెట్టి.. ఒక్కో కేరక్టర్ కు లుక్స్.. చిన్న పాటి టీజర్ చొప్పున విడుదల చేస్తూ అంతంకంతకూ ఆసక్తిని రెట్టింపు చేస్తూ వచ్చారు. ట్రైలర్ వచ్చినప్పుడు బాహుబలి 2 కి హైప్ కనపడింది కానీ ఇప్పుడు కాస్త నీరసంగానే ఉంది అంటున్నారు. పబ్లిసిటీ యాక్టివిటీస్ లో ఒకప్పటి లాగా క్రియేటివిటీ వాడడం లేదు. అనుకున్న స్థాయి లో ఓపెనింగ్ లు వస్తాయా లేదా అనేది తెగ డిస్కషన్ జరుగుతోంది. అసలే ఈ సినిమా కోసం ఒక పక్క ప్రేక్షకులు చాలా ఆతురతగా ఎదురు చూస్తున్న క్రమంలో ఈ ట్విష్ట్ కాస్త షాకింగ్ అనే చెప్పాలి…చూద్దాం ఏం జరగబోతుందో.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.