తెలుగువారి సత్తాని బాహుబలి కంక్లూజన్ మూవీ ప్రపంచానికి చాటింది. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి బృందం ఐదేళ్లపాటు శ్రమించి రూపొందించిన ఈ మూవీ నాలుగు భాషల్లో మనదేశంతో పాటు దుబాయ్, అమెరికాలో రిలీజ్ అయి సంచలనం సృష్టిస్తుంది. బాలీవుడ్ సినిమాలకి సైతం సాధ్యం కానీ 1500 కోట్ల మెయిలు రాయిని దాటి చరిత్రను లిఖించింది. అయినా మరో పరీక్షను ప్రభాస్ మూవీ ఎదుర్కోనుంది. వచ్చే నెలలో బాహుబలి 2 సినిమా చైనాలో విడుదల కానున్నది. బాహుబలి మొదటి భాగం అక్కడ విజయం సాధించలేదు. అయినా బాహుబలి కంక్లూజన్ ని అత్యంత భారీగా చైనాలో భారీగా విడుదల చేయబోతున్నారు. ఆ దేశంలోనే బాహుబలి 500 కోట్లు కలక్షన్ సాధించే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది.
ఎందుకంటే బాహుబలి దెబ్బకి ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలక్షన్ సాధించిన భారతీయ సినిమా జాబితాలో రెండో స్థానానికి పడిపోయిన దంగల్ చైనాలో వసూళ్ల దాటికి నంబర్ వన్ స్థానానికి ఎగ బాకుతోంది. అమీర్ ఖాన్ నటించిన దంగల్ అక్కడ మూడు వారాల్లో 778.32 కోట్లు వసూలు చేసి మొత్తం కలక్షన్స్ 1522.66 కోట్లకు చేరుకుంది. త్వరలో బాహుబలి 2 రికార్డ్స్ ని దంగల్ బద్దలు కొట్టనుంది. దంగల్ రికార్డ్స్ ని బీట్ చేయాలంటే చైనాలో బాహుబలి కంక్లూజన్ విజయం సాదించాలి. 500 కోట్లు వసూలు చేస్తే 2000 కోట్లు కొల్లగొట్టిన భారతీయ చిత్రంగా చలన చిత్ర చరిత్రలో నిలిచిపోతుంది. దంగల్ రికార్డ్స్ ని తుంగలో తొక్కినట్లు అవుతుంది. అందుకే మరో సారి బాహుబలి సత్తా చాటాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.