ఏ ముహూర్తాన రాజమౌళి బాహుబలి సినిమాని మొదలు పెట్టాడో కానీ, బహుశా అదే ముహూర్తం పిడుగులా మారి బాలీవుడ్ నెత్తినపై కూర్చుంటుంది అని ఆలోచించి ఉండరు. అవును బాహుబలి బారీ హిట్, ఎంత పెద్ద హిట్ అంటే, ఇన్నేళ్ల చరిత్రలో బాలీవుడ్ లో ఎవ్వరూ తిరగరాయలేని సినిమాగా బాహుబలి చరిత్రలో నిలిచినంత హిట్. బాలీవుడ్ ఖాన్స్ గా చెప్పుకునే హింది హీరోల రికార్డ్స్ ను తిరగరాసి తన జేబులో వేసుకుని బాలీవుడ్ శిఖరంపై తెలుగువాడి జెండాను ఎగరవేసింత హిట్. అయితే ఈ హిట్ గురించి బాలీవుడ్ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ఏమంటున్నాడు అంటే, బాలీవుడ్ లో బాహుబలి మ్యానియా ఇంకా తగ్గలేదు.
ఈ సినిమా కేవలం హింది బాషలోనే దేశవ్యాప్తంగా 500కోట్ల రూపాయలు వసూలు చేసి రికార్డు సృష్టించింది. అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ చిత్రంగా ‘బాహుబలి 2’ అగ్రస్థానంలో నిలిచిందని తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. అదే క్రమంలో ‘బాహుబలి 2’ కన్నా ముందు హిందీలో 2014లో విడుదలైన ‘పీకే’ అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచినప్పటికీ, మొత్తంగా చూసుకుంటే బాలీవుడ్ చరిత్రను చెరిపేసన టాలీవుడ్ చిత్రంగా నిలిచి ఘన చరిత్ర సృస్టించింది బాహుబలి. ఏది ఏమైనా, అన్ని బాషల్లో కలిపి బాహుబలి 2000కోట్ల వసూళ్లు సాధించడం తెలుగువారిగా, మనం గర్వించదగ్గ విషయం అనే చెప్పాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.