పాతిక రోజుల్లో అందరూ ఎదురుచూస్తున్న బాహుబలి కంక్లూజన్ థియేటర్లోకి రానుంది. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కలయికలో వస్తున్న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఏడుభాషల్లో ఒకేసారి ఆరువేల థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇన్ని భాషల్లో, ఇన్ని వేల థియేటర్లలో విడుదలవుతున్న తొలి భారతీయ చిత్రం బాహుబలి 2. ఈ చిత్రం గురించి బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ మాట్లాడుతూ “బాహుబలి కంక్లూజన్ విడుదల అనేది భారతీయ చిత్ర పరిశ్రమకు పెద్ద వేడుక వంటిది. ” అని చెప్పారు. “నిజంగా ఏప్రిల్ 28 న దేశం మొత్తం మీద పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది” అని వెల్లడించారు.
బాహుబలి బిగినింగ్ ని ఈనెల 7 వ తేదీన రీ రిలీజ్ చేయనున్న సందర్భంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయాలను వెల్లడించారు. నాలుగురోజుల్లో బాహుబలి మొదటి పార్ట్ హిందీ వెర్షన్ థియేటర్లో మళ్ళీ రిలీజ్ కానుంది. బాహుబలి 1 హిందీ థియేటర్ రైట్స్ తో పాటు బాహుబలి 2 హిందీ థియేటర్ రైట్స్ ను కరణ్ జోహార్ సొంతం చేసుకున్నారు. భారీ కలక్షన్స్ సాధించాలనే లక్ష్యంతో కరణ్ జోహార్ నార్త్ ఇండియా మొత్తం విస్తృతమైన ప్రచారాన్ని చేస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.