తెలుగు సినిమాల స్థాయిని పెంచిన చిత్రం బాహుబలి. దర్శకధీరుడు ఎస్.ఎస్,రాజమౌళి వెండితెరపైన లిఖించిన అద్భుతమైన ఈ కళాఖండం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల్ని మెస్మరైజ్ చేసింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వీరోచితంగా నటించిన ఈ మూవీ 650 కోట్లను కొల్లగొట్టి ఔరా అనిపించింది. తెలుగు వారి చిత్రాలపై ఉన్న చిన్న చూపుని పూర్తిగా చెరిపివేసింది. ఈ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న బాహుబలి కంక్లూజన్ కోసం పొరుగు రాష్ట్రాల ప్రజలు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఆయా భాషల వారు బాహుబలి 2 స్ట్రైట్ చిత్రంగా భావిస్తున్నారు. అంతలా ఈ ఫిల్మ్ పై క్రేజ్ ఏర్పడింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.
అన్ని హంగులతో ఏప్రిల్ 28 న విడుదలచేయడానికి జక్కన్న బృందం శ్రమిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే 300 కోట్లు కొల్లగొడుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. బాహుబలి 2 ఫస్ట్ లుక్ రిలీజ్ రోజున రాజమౌళి మాట్లాడుతూ వెయ్యికోట్ల కలక్షన్స్ ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఈ లక్ష్యాన్ని ప్రభాస్ మూవీ సులువుగా చేరుకుంటుందని, ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుందని టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ పండితులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బాహుబలి కంక్లూజన్ భారతీయ సినిమా స్థాయిని పెంచుతుందని విశ్వసిస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.