బేబీ’ సినిమా సూపర్ డూపర్ హిట్ అవటంతో, ఆ సినిమా నిర్మాత ఎస్.కె.ఎన్ పెద్ద నిర్మాతగా ఇప్పుడు పలు చిత్రాలు నిర్మించడానికి పూనుకున్నాడు. అందులో ఒకటి ‘బేబీ’ సినిమాని హిందీలో రీమేక్ చెయ్యడానికి సన్నాహాలు చెయ్యడం. ఇది అధికారికంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. ఎస్.కె.ఎన్ లేదా శ్రీనివాస్ అనే వ్యక్తి మొదటి నుండీ మెగా అభిమాని. మెగాస్టార్ చిరంజీవి కి వీరాభిమాని, అలాగే అల్లు అరవింద్ అంటే గురువుతో సమానంగా చూస్తాడు శ్రీనివాస్.
జర్నలిస్టుగా, తరువాత అల్లు అర్జున్ దగ్గర మేనేజర్ గా చేస్తూ, గీత ఆర్ట్స్ లో పని చేస్తున్న శ్రీనివాస్ కి అల్లు అరవింద్ ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. ఆ ప్రోత్సాహం తోటే నిర్మాతగా మారి ముందుగా చిన్న సినిమాలు నిర్మించి కొంచెం నిలదొక్కుకున్నాక, తాజాగా ‘బేబీ’ అనే సినిమాతో పెద్ద నిర్మాత అయ్యాడు. ‘బేబీ’ కూడా చిన్న సినిమానే, కానీ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘనవిజయం సాధించి రూ.100 కోట్ల క్లబ్బులో చేరటంతో, ఎస్.కె.ఎన్ నిర్మాతగా ఎంతో ఎదిగిపోయాడు.
ఈ ‘బేబీ’ అఖండ విజయం, ఇంతకు ముందు సినిమాల నిర్మాణాల వెనక నిర్మాత అల్లు అరవింద్ పాత్ర ఎంతో ఉంది. ఎందుకంటే అరవింద్ SKN ను ప్రోత్సహిస్తూ అవసరమైన సందర్భంలో సపోర్ట్ చేశారు, అలాగే గైడ్ చేశారు, సొంతమనిషిలా చూసుకున్నారు. అటువంటి సమయంలో ఎస్.కె.ఎన్ ఇంత పెద్ద విజయం సాధించటం, పెద్ద నిర్మాతగా ఎదగడం, దానితో ఆర్థికంగా స్ట్రాంగ్ అవడం అరవింద్ గారికి సంతోషాన్నిచ్చే విషయం.
మెగాస్టార్ చిరంజీవి కూడా ‘బేబి’ విజయోత్సవ సభలో తన అభిమాని అయిన SKN నిర్మాత అవడం తనకెంతో గర్వంగా ఉందని చెప్పారు. బేబి’ హిట్ తర్వాత ఆ సినిమా దర్శకుడు అయిన సాయి రాజేశ్ నిర్మాణ సంస్థ అమృత ప్రొడక్షన్స్ తో కలిసి ఆనంద్ దేవరకొండ, సంతోష్ శోభన్ లతో కల్ట్ లవ్ స్టోరీ మూవీస్, కమర్షియల్ సినిమాలు నిర్మిస్తున్నారు ఎస్.కె.ఎన్ .
అలాగే ‘బేబి’ సినిమా హిందీలో రీమేక్ కూడా చేస్తున్నాడు (SKN) ఎస్.కె.ఎన్. ఇలా ఆర్థికంగా బలపడటంతో ఇటీవలే ఎస్.కె.ఎన్ ఓ బెంజ్ కారు కూడా కొన్నాడు. తాను కొన్న కారుని తన గురువు లాంటి అరవింద్ గారికి చూపించాలని గీతా ఆర్ట్స్ ఆఫీస్ దగ్గర అతన్ని కలిశాడు. అరవింద్ గారు కూడా శిష్యుడి ఎదుగుదల చూసి చాలా సంతోషింషి, అతనికి అభినందనలు తెలియచేసారు.