అల్లరి నరేష్ (Allari Naresh) లేటెస్ట్ మూవీ ‘బచ్చల మల్లి'(Bachhala Malli) ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘సోలో బ్రతుకే సో బెటర్’ (Solo Brathuke So Better) వంటి కమర్షియల్ హిట్ అందించిన సుబ్బు (Subbu Mangadevi) ఈ చిత్రానికి దర్శకుడు. ‘హాస్య మూవీస్’ బ్యానర్ పై రాజేష్ దండ (Rajesh Danda) నిర్మించారు. అయితే మొదటి రోజు ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. సినిమాలో కొన్ని సన్నివేశాలు బాగున్నప్పటికీ ఎమోషనల్ గా ఆడియన్స్ కనెక్ట్ అవ్వకపోవడంతో నెగిటివ్ టాక్ వచ్చినట్టు స్పష్టమవుతుంది.
Bachhala Malli Collections:
అయినప్పటికీ మొదటి రోజు ఓపెనింగ్స్ బెటర్ గానే వచ్చాయి. కానీ రెండో రోజు పడిపోయాయి. ఒకసారి (Bachhala Malli) 2 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:
‘ బచ్చల మల్లి’ సినిమాకు రూ.5.35 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.6 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2 రోజుల్లో ఈ సినిమా రూ.0.79 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.5.21 కోట్ల షేర్ ను రాబట్టాలి.