ఇవాళ (డిసెంబర్ 21) తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లైఫ్ లో అల్లు అర్జున్ (Allu Arjun) పై నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా రేవంత రెడ్డి మాట్లాడుతూ.. “ఒకావిడ చనిపోయిందని అల్లు అర్జున్ కి పోలీసులు చెప్పినా వినలేదు, ఆఖరికి అరెస్ట్ చేస్తామంటే కానీ బయటికి రాలేదు” అంటూ చేసిన కామెంట్ లేనిపోని చర్చలకు దారి తీసింది. దాంతో ఒక్కసారిగా సోషల్ మీడియా మొత్తం అల్లు అర్జున్ మీద విరుచుకుపడ్డారు. అయితే.. వెంటనే ఈ విషయమై స్పందించేందుకు ప్రెస్ మీట్ పెట్టిన అల్లు అర్జున్..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను గట్టిగా ఖండించారు. ఈ ప్రెస్ మీట్ లో బన్నీ మాట్లాడుతూ.. “తనపై అసత్య ప్రచారాలను చేస్తున్నారని. తనకు పోలీసులు థియేటర్ లోపలికి వచ్చి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. పైగా.. నేను థియేటర్ కి వస్తే వాళ్లే దారి క్లియర్ చేశారు. అలాంటప్పుడు పర్మిషన్ లేదు అని ఎలా అనుకుంటాను. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో ఎవరి తప్పు లేదు. థియేటర్ అంటే గుడి లాంటిది.. అలాంటి చోట ఇలాంటి సంఘటన జరగడం అనేది బాధాకరం. మరీ ముఖ్యంగా నేనేమీ ర్యాలీ నిర్వహించలేదు..
జనం గుమిగూడేసరికి ట్రాఫిక్ క్లియర్ చేయడం కోసం కారు నుండి పైకి వచ్చి జరగండి సైగలు చేసాను. నాకు విషయం తెలిసిన వెంటనే బన్నీ వాసుని (Bunny Vasu) పంపించాను.. నేను హాస్పిటల్ కి వెళ్దాం అనుకుంటుంటే.. కేస్ అయ్యిందని చెప్పి, రావద్దని వారించారు. ఎక్కడో విజయవాడలో ఫ్యాన్స్ చనిపోయారు అంటేనే నేను డిస్టర్బ్ అయిపోయాను, అలాంటిది ఇక్కడ ఒక అభిమాని చనిపోతే.. నేను స్పందించనా?. ఎక్కడో విజయవాడలో ఫ్యాన్స్ చనిపోయారు అంటేనే నేను డిస్టర్బ్ అయిపోయాను అలాంటిది ఇక్కడ ఒక అభిమాని చనిపోతే.. నేను స్పందించనా?. శ్రీతేజ్ కోసం ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం అనుకున్నాం. నాకు కూడా ఆ వయసు కొడుకు ఉన్నాడు,
అలాంటిది నేను స్పందించకుండా ఎలా ఉంటాను” అంటూ వివరణ ఇచ్చారు అల్లు అర్జున్ (Allu Arjun). అనంతరం అల్లు అరవింద్ (Allu Aravind) మాట్లాడుతూ.. “దేశం మొత్తం రికార్డ్స్ సృష్టిస్తున్నా మావాడు మాత్రం మౌనంగా బాధపడుతున్నాడు. కనీసం బయటకి వెళ్లి స్నేహితులను కూడా కలవలేదు. అల్లు కుటుంబంలో మూడు జనరేషన్స్ నుంచి ఎవరమైనా ఇలాంటి బ్లేమ్ ను ఫేస్ చేయాల్సి వచ్చిందా? అల్లు అర్జున్ 22 ఏళ్ల పాటు కష్టపడి క్రియేట్ చేసుకున్న ఇమేజ్ ఇది, దయచేసి దాన్ని డ్యామేజ్ చేయకండి. మీడియా అభిమానంతో ఎదిగిన కుటుంబం మాది, దయచేసి అర్థం చేసుకోండి. ఇంతకుమించి నేనేమీ మాట్లాడకూడదు” అన్నారు.
– నేను పర్మిషన్ లేకుండా థియేటర్ కి వెళ్ళాను అనేది అసత్య ప్రచారం..
– నేను థియేటర్ కి వెళ్తే.. పోలీసులే రూట్ క్లియర్ చేశారు..