Trivikram: పాపం.. త్రివిక్రమ్ పరిస్థితి ఇలా అయిపోయిందేంటి..!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు అంతా సిద్ధంగా ఉంటారు. 2023 లో వచ్చిన అల వైకుంఠపురములో వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అనుకోకుండా 3 ఏళ్ళు గ్యాప్ వచ్చేసింది. మొదట ఎన్టీఆర్ తో సినిమా అనౌన్స్ చేశాడు. కానీ ఆర్.ఆర్.ఆర్ వల్ల అది డిలే అవుతూ వచ్చింది. తర్వాత ఆ ప్రాజెక్ట్ హోల్డ్ లో పడినట్టు చెప్పుకొచ్చారు. అటు తర్వాత రామ్ తో సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి.

స్రవంతి రవికిషోర్ గారి పై ఉన్న అభిమానంతో త్రివిక్రమ్ సినిమా చేయడానికి రెడీ. కానీ రామ్ అంతకు ముందు కమిట్ అయిన ప్రాజెక్టుల వల్ల అది కూడా డిలే అయ్యింది. పవన్ కళ్యాణ్ వంటి స్టార్ ను గ్రిప్ లో పెట్టుకున్న త్రివిక్రమ్ కు అనుకున్న వెంటనే అతనితో సినిమా తీసే అదృష్టం లేదు. అతనికి ఉన్న రాజకీయాల కమిట్మెంట్ ల వల్ల అతనితో సినిమా ఓకే చేసుకుంటే అటూ ఇటూ కాకుండా అయిపోతాడు.

అందుకే మహేష్ ను పట్టాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారితో అగ్రిమెంట్ ఉంది కాబట్టి.. 2015 లోనే అడ్వాన్స్ తీసుకున్నాడు కాబట్టి.. మహేష్ ఈ ప్రాజెక్టుకి రెడీ అయ్యాడు. కానీ ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి చాలా టైం పట్టింది. 2021 మే లో అనౌన్స్మెంట్ వస్తే ఇప్పటికీ రెగ్యులర్ షూటింగ్ జరగడం లేదు. ఈ మధ్యనే ఓ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించారు.

సెకండ్ షెడ్యూల్ ఈ నెలాఖరులో ప్లాన్ చేస్తే ఇప్పుడు కృష్ణ గారి మృతితో అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఎందుకంటే మహేష్ ఇప్పుడు చాలా దుఃఖం లో ఉన్నాడు. ఒక నెల రోజుల వరకు షూటింగ్ కు రాకపోవచ్చు. ఈ పెద్ద ప్రాజెక్టుని మధ్యలో వదిలేసి త్రివిక్రమ్ బయటకెళ్ళడం కూడా అసాధ్యమే. జులాయి తర్వాత నుండి త్రివిక్రమ్ సినిమాలు సెట్స్ కు వెళ్ళడానికి చాలా టైం తీసుకుంటుంది.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus